https://oktelugu.com/

Allu Arjun vs Nagababu : నాగబాబు కామెంట్స్ కు ఘాటుగా రీప్లే ఇచ్చిన అల్లు అర్జున్…

తనే పెట్టి హ్యాక్ చేశారని అబద్దం చెప్తున్నాడేమో అంటూ వాళ్ళ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ అకౌంట్ నుంచి నాగబాబు మీద ఒక తీవ్రమైన ఘాటు వాఖ్య రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : May 16, 2024 / 12:02 PM IST

    Allu Arjun gave a strong replay to Nagababu's comments

    Follow us on

    Allu Arjun vs Nagababu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా ఆ తర్వాత ఆర్యతో మాత్రమే జనాల్లో ఆయనకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ప్రత్యేకంగా యూత్ లో ఒక స్టార్ గా వెలుగొందడానికి ఆయనకు ఆర్య సినిమా చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి.

    ఇక అప్పటి నుంచి మొదలైన ఆయన సినీ ప్రస్థానం పుష్ప సినిమా వరకు చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మైమరిపింప చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి చాలా విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ విషయం మీద నాగబాబు ఇన్ డైరెక్టుగా అల్లు అర్జున్ తమకు వెన్నుపోటు పొడిచాడు అనే విధంగా ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక దీన్ని ఉద్దేశించి ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టిన ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అదేంటి..

    నాగబాబు పెట్టిన పోస్ట్ కి రిప్లై గా “శ్రీ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందు పంచర్ షాప్ లో పనిచేస్తూ ఉండేవాడు” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక నిజంగా బన్నీ ఇలాంటి పోస్ట్ పెట్టాడా లేదా ఎవరైనా క్రియేట్ చేసి అభాసుపాలు చేసేలా ప్లాన్ చేశారో తెలియడం లేదు. దీనిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఎవరో కావాలనే బన్నీ అకౌంట్ ని హ్యాక్ చేసి అలా పెట్టారు అని కొంతమంది అంటుంటే, ఇక మరి కొంత మంది మాత్రం హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అంటున్నారు. నిజమెంటో కానీ సోషల్ మీడియాలో మాత్రం బన్నీ పెట్టినట్టున్న పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    తనే పెట్టి హ్యాక్ చేశారని అబద్దం చెప్తున్నాడేమో అంటూ వాళ్ళ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ అకౌంట్ నుంచి నాగబాబు మీద ఒక తీవ్రమైన ఘాటు వాఖ్య రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి…