Mythri Movie Makers: తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు పొందిన వాటిలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. ప్రతుత్తం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మైత్రి బ్యానర్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్న్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో లతో సినిమాలను నిర్మిస్తుంది. అప్డేట్ ల విషయంలో ఎప్పుడు కరెక్ట్ గా ఉండే మైత్రి , ఇప్పుడు నెటిజన్ల విమర్శలకు గురవుతుంది. ఈ మేరకు తాజాగా “వరస్ట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుండడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మైత్రి శ్రద్ధ పెట్టట్లేదని అల్లు అర్జున్ అభిమానులు వాదిస్తున్నారు. కాగా ఇటీవల నవంబర్ 21న ఇక నుంచి ‘పుష్ప’ సినిమా నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయని మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా ప్రకటించింది. అయితే నిన్న మాత్రం “మీ ఆతృత మాకు అర్థమవుతోంది. ‘పుష్ప’ ప్రమోషనల్ కంటెంట్ ను మీతో పంచుకోవడానికి మేము కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ట్రైలర్ వర్క్ సాలిడ్ గా జరుగుతోంది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో ట్రైలర్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాము” అంటూ ప్రేక్షకులను ఊరించారు. అయితే కనీసం ఆ పోస్టర్ ఎప్పుడు వస్తుంది ? అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమా విడుదలకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండడంతో బన్నీ అభిమానులు నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో #worstbannerMythriOfficial అని ట్రెండ్ చేస్తున్నారు.