Allu Arjun : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్ప్రయత్నమైతే చేస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పుష్ప(Pushpa) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు…ఇక ప్రస్తుతం పామ్ ఇండియాలో ఆయన స్టార్ డమ్ అనేది భారీగా విస్తరిస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన అట్లీ (Atlee) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందు అట్లీ చేసిన సినిమాలను కనక చూసుకుంటే ఇతర భాషల్లో సూపర్ సక్సెస్ అయిన సినిమాల్లోని సీన్లను అతని సినిమాలో పెట్టుకొని కమర్షియల్ సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే మిగతా సినిమాల్లోని సీన్లని కొన్నింటిని తీసుకొని ఆయన ఒక స్క్రిప్ట్ ఫామ్ చేసుకొని సినిమాలు చేస్తాడు అనే ఒక బ్యాడ్ నేమ్ అయితే అతనికి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కాబట్టి అల్లు అర్జున్ అట్లీ కి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం అట్లీ ని చాలా బ్లైండ్ గా నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యంపై అల్లు అర్జున్ మౌనం వెనుక అర్థం ఏమిటి?
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికి వాటికి ప్రేక్షకుల్లో పెద్దగా ఆదరణ అయితే దక్కడం లేదు. కలెక్షన్ల పరంగా రికార్డులను సృష్టిస్తున్నప్పటికి ఆయన సినిమాల పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం అంత సంతృప్తిగా లేరనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ తనతో సినిమా చేయడం కరెక్టేనా? అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక భారీ సక్సెస్ ని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు దక్కనటువంటి క్రేజ్ అల్లు అర్జున్ కైతే దక్కింది. పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన ఇకమీదట రాబోయే సినిమాలతో సక్సెస్ ను సాధిస్తాడా? తద్వారా ఆయన సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…