https://oktelugu.com/

Allu Arjun Craze: బడా హీరోలకే దిమ్మదిరిగేలా బన్నీకి క్రేజ్

Allu Arjun Craze:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయనకు దేశమంతా అభిమానులను సంపాదించుకున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తన సత్తా చాటుతున్నారు. పుష్పతో తన ఖ్యాతి దశ దిశలా వ్యాపించడంతో ఆయనకు ఎదురులేకుండా పోతోంది. బన్నీ సినిమాలు మలయాళంలో కూడా మంచి క్రేజీ సంపాదించుకుంటున్నాయి. దీంతో పెద్ద హీరోలు కూడా బన్నీ సినిమా వస్తుందంటే తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2022 / 09:14 AM IST
    Follow us on

    Allu Arjun Craze:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయనకు దేశమంతా అభిమానులను సంపాదించుకున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తన సత్తా చాటుతున్నారు. పుష్పతో తన ఖ్యాతి దశ దిశలా వ్యాపించడంతో ఆయనకు ఎదురులేకుండా పోతోంది. బన్నీ సినిమాలు మలయాళంలో కూడా మంచి క్రేజీ సంపాదించుకుంటున్నాయి. దీంతో పెద్ద హీరోలు కూడా బన్నీ సినిమా వస్తుందంటే తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది. అంతటి ఘనత సాధించిన స్టార్ గా అల్లు అర్జున్ కు గుర్తింపు వచ్చింది. దీంతో ఆయన సినిమాలకు మంచి క్రేజీ ఏర్పడుతోంది.

    Allu Arjun

    పుష్పలో నటనకు గాను అర్జున్ కు ఎన్నో రివార్డులు వచ్చాయి. పుష్ప ఓ సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో బన్నీకి మరింత క్రేజీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పొచ్చు. త్రిపుల్ ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, పుష్పతో అల్లు అర్జున్ ల స్టామినా ఇనుమడించిందనే చెప్పాలి. దీంతో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: Vikram Box Office Collection: బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన విక్రమ్!

    పుష్ప రాబట్టిన వసూళ్లతో అందరికి ఆశ్చర్యం కలిగింది. రూ. 100 కోట్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయినా అంతకుముందే ఆయనకు క్రేజీ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. భవిష్యత్ లో మరిన్ని రికార్డు సినిమాలు చేసి బన్నీ మరింత ఎత్తుకు ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప సృష్టించిన కలెక్షన్ల సునామీలో బన్నీ స్నానం చేసి తనకు ఎదురే లేదని నిరూపించాడు.

    Allu Arjun

    నటనతోపాటు డాన్సుల్లోనూ అదరగొడతాడు. చిరంజీవి తరువాత ఆ లెవల్లో డాన్సులు చేసేది బన్నీ అని తెలిసిందే. అందుకే అల్లు అర్జున్ కు అంతలా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఐకాన్ స్టార్ గా తన స్టామినా చూపిస్తున్నాడు. కలెక్టన్లు కొల్లగొడుతున్నాడు. పరిశ్రమలో తనకు తానే సాటి తనకు తనకే పోటీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలు సొంతం చేసుకుని మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

    Also Read:Jr NTR Craze in Israel: ఇజ్రాయిల్ మీడియాలో జూ.ఎన్టీఆర్ సంచలనం.. ఏమైంది? ఎందుకు హెడ్ లైన్ అయ్యారు?

    Tags