Allu Arjun- NTR: సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ సక్సెస్ లో ఉంటే వాళ్లకి మాత్రమే మార్కెట్ లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టే హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇక ఒక సినిమాకి ఒక హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో అంతకుమించి ఆ సినిమాకి వసూళ్లను రాబట్టే సత్తా ఆ హీరో దగ్గర ఉందనే చెప్పాలి.ఇక ఈ క్రమంలోనే ఎన్టీయార్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన కూడా ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ని మినహా ఇస్తే ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క ఇండస్ట్రీ హిట్టు కూడా లేదు.
ఇక అరవింద సమేత సినిమా తర్వాత ఆయన దాదాపు మూడు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ సినిమా బిజీ లోనే ఉన్నాడు ఇక ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ అంత రామ్ చరణ్ కి వెళ్ళిపోవడం జరిగింది.ఇక ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ 3 సంవత్సరాలు ఒక సినిమా మీదనే ఉండటంవల్ల ఆయన మార్కెట్ ని భారీగా నష్టపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికే అరవింద సమేత తర్వాత మూడు సంవత్సరాల నుంచి సినిమా రిలీజ్ చేయకుండా ఉండటం తో ఎన్టీఆర్ మార్కెట్ ని అలా వైకుంఠపురం లో సినిమాతో అల్లు అర్జున్ కబ్జా చేసేసాడు.
ఆయన కి ఎంత మార్కెట్ అయితే ఉందో అదే మార్కెట్ ని అల్లు అర్జున్ క్యాష్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాతో స్టార్ హీరోల రేస్ లో ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి తను ముందుకు రావడం జరిగింది. నిజానికి ఇండస్ట్రీలో ఆరుగురు స్టార్ హీరోలు ఉన్నారు ఎవరు ఎక్కువ సక్సెస్ లు కొడుతూ ఉంటే వాళ్ళు ముందు వరుసలోకి వస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పైన భారీ దెబ్బ కొట్టడం అనేది ఎన్టీఆర్ గానీ , ఆయన అభిమానులు గాని జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి.ఇక ఎన్టీఆర్ పరిస్థితి చెప్పాలంటే అటు త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోగా చేసినప్పటికీ గుర్తింపు మాత్రం రామ్ చరణ్ కి రావడంతో ఆ సినిమా చేసిన ఆయనకి పెద్దగా ఒరిగిందేమీ లేదు.
ఎన్టీయార్ కి గ్యాప్ రావడం తో ఎన్టీయార్ ఏ ప్లేస్ లో అయితే స్ట్రాంగ్ గా ఉన్నాడో ఆ జోన్ ల లోకి అల్లు అర్జున్ తన సినిమాల ద్వారా వెళ్లి సూపర్ హిట్లు కొట్టి ఆ ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్నాడు. దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. తెలుగులో చూసుకున్న అలాగే మలయాళంలో చూసుకున్న,టోటల్ పాన్ ఇండియా వైడ్ గా చూసుకున్న ఆయనకి మార్కెట్ అనేది విపరీతంగా పెరిగింది.ఇక పుష్ప సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది…మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఎన్టీయార్ మార్కెట్ ని భారీ గా దెబ్బ కొట్టాడు…