Allu Arjun Birthday: స్టార్ హీరోల పుట్టినరోజు అభిమానులకు ఒక పండుగ లాంటిది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు, సంబరాలు చేయడం వంటివి దశాబ్దాల నుండి చూస్తూనే ఉన్నాం. కాలం గడిచే కొద్దీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక మార్పులు వస్తుంటాయి కానీ, హీరోల పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకోవడం లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ స్టార్ హీరోల కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటారు మేకర్స్. రీసెంట్ గానే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో కి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపించింది. అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 రాబోతుంది, కచ్చితంగా ప్రస్తతం ఆయన అట్లీ తో చేస్తున్న మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో వస్తుందని అంతా అనుకున్నారు.
అలాంటి అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఇప్పుడు ఒక చేదు వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న మూవీ గురించి ఎలాంటి అప్డేట్ కూడా ఏప్రిల్ 8 న రావడం లేదట. గ్లింప్స్ వీడియో ని ఆశించారు, కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇవి పక్కన పెడితే కనీసం టైటిల్ అయినా చెప్పొచ్చు కదా, సినిమా మొదలై సంవత్సరం దాటింది, అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కంటెంట్ కూడా బయటకు రాకపోవడం బాధాకరం అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం తో పాటు అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. జూన్ నుండి ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతుంది.
కనీసం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అయినా వస్తుందా అని అభిమానులు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. వీటిని సంగతి తెలియదు కానీ, అల్లు అర్జున్ రీసెంట్ గానే మలయాళం యంగ్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ తో ఒక సూపర్ హీరో మూవీ ని ఒప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదొక్కటే అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకునే వార్త. అంతే కాకుండా అదే రోజున రేస్ గుర్రం చిత్రం కూడా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీనిని కూడా అభిమానులు బాగా ఎంజాయ్ చేయొచ్చు.