Allu Arjun Atlee Movie: సినిమా ఇండస్ట్రీ లో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఫ్యామిలీ బ్యా గ్రౌండ్ ఉన్నప్పటికి మన టాలెంట్ ని చూపించుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే సక్సెసులు దక్కుతాయి. అలా కాదని గట్టిగా సినిమాలు చేస్తూ వెళ్తే ఫ్లాపులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఫలితంగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళలో మన స్టార్ హీరోలు ఉండడం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా మన స్టార్ హీరోలకు వచ్చినంత గుర్తింపు మిగతా హీరోలకు రావడం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియాని ఏలుతున్న హీరోలు మనవాళ్లే కావడం విశేషం… ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన స్టార్ హీరో అల్లు అర్జున్… ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎటువంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతూ చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ కంప్లీట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ సైతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని మే వరకు ఫ్రీ అయిపోతారట. ఇక ఈ మూవీ తర్వాత ఆయన ఇంకో సినిమాలో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా 2026వ సంవత్సరంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు.
మొత్తానికైతే ఇప్పుడు షూట్ చేసిన సన్నివేశాలకు వెంట వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఎడిటింగ్, సిజి అలాగే బ్యా గ్రౌండ్ స్కోర్ ను కూడా కంపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే అటు అట్లీ, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో టాప్ లెవెల్ కి వెళ్లిపోతారు.
లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే పరిస్థితి ఉంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో అట్లీ ఉన్నాడు. అల్లు అర్జున్ సైతం అట్లీ ఏది చెబితే అది చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…