Allu Arjun Atlee Movie Updates: ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటనే ఒక సంచలనం. సాంకేతికంగా ఇది రాజమౌళి సినిమాకు ఏ మాత్రం తీసిపోదు అనే రేంజ్ లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని, ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అంటూ సోషల్ మీడియా లో పెద్ద ప్రచారమే జరిగింది. దానికి తోడు అల్లు అర్జున్, దీపికా పదుకొనే(Deepika Padukone) ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతున్న వీడియోస్ ని విడుదల చేయగా, వాటికి స్టార్ హీరోల టీజర్ లేదా ట్రైలర్ విడుదలైతే ఎంత రెస్పాన్స్ వస్తుందో, అంతటి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో డైరెక్టర్ అట్లీ తెలుగు నటీనటులకంటే ఎక్కువగా తమిళ నటులనే ఎంపిక చేసుకున్నాడు, ఇది కాస్త ఫ్యాన్స్ ని కాస్త అయ్యోమయ్యం లోకి నెట్టేసింది.
తాజా షెడ్యూల్ చెన్నై లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ దీపికా పదుకొనే తో పాటు కమెడియన్స్ కోవై సరళ(Kovai Sarala), యోగి బాబు(Yogi Babu) వంటి వారు కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, అసలు వీళ్ళు ఈ చిత్రం లో భాగం కావడం ఏంటి?, అసలు అట్లీ అల్లు అర్జున్ తో తీస్తున్న చిత్రం పాన్ వరల్డ్ చిత్రమా?, లేదా తమిళ చిత్రమా అనే అయోమయ్యాం లో పడ్డారు ఫ్యాన్స్. మళ్ళీ వీళ్ళ చేత అట్లీ క్రింజ్ కామెడీ చేస్తే చూసి తట్టుకునే శక్తి ఆడియన్స్ కి లేదని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ఒక స్పెషల్ రోల్ కోసం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ని కూడా సంప్రదించారట. ఆయన కూడా నటించేందుకు మక్కువ చూపుతున్నట్టు తెలుస్తుంది. విజయ్ సేతుపతి సాధారణంగా ఒక పాత్ర ని అంత తేలికగా ఒప్పుకునే రకం కాదు.
Also Read: అందుకే సినిమాలు మానేసాను అంటూ సమంత ఎమోషనల్ కామెంట్స్!
పెద్ది సినిమాలో ఒక క్యారక్టర్ ని కూడా ఆయన అదే విధంగా వదులుకున్నాడు. అలాంటిది అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటించడానికీ ఒప్పుకున్నదంటే ఆయన పాత్ర లో ఎంత దమ్ముందో అర్థం చేసుకోవచ్చు. ఇక పోతే ఈ చిత్రం లో మొత్తం 5 మంది హీరోయిన్లు ఉంటారు. అందులో దీపికా పదుకొనే గురించి రీసెంట్ గానే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ లపై కూడా అనే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక విలన్ క్యారక్టర్ లో మెరవనుంది. మరో హీరోయిన్ పాత్ర కోసం జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమలు పూర్తి చేసి వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు దింపే ప్రయత్నం లో ఉన్నారు మేకర్స్.