Allu Arjun Atlee Movie Guest Appearances: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… అయితే ఈ సినిమాని ఒక సూపర్ మాన్ స్టోరీ లాగా రాసుకున్నారట. విజువల్ గా కూడా సినిమాని చాలా టాప్ నాచ్ లో చూపించాలనే ప్రయత్నంలో అట్లీ అయితే తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు సైతం గెస్ట్అపీరియన్స్ ఇవ్వబోతున్నారట. అందులో ఒకరు తెలుగు హీరోగా కాగా, మరొకరు తమిళ హీరో కావడం విశేషం… ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ తార స్థాయిలో ఉంది.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
మరి ఆయన నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోవాలి అంటే మాత్రం రాబోయే వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. అందులో ఏమాత్రం తేడా జరిగినా కూడా ఆ సినిమా ప్లాప్ అవ్వడమే కాకుండా మార్కెట్ కూడా విపరీతంగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక ఈ సినిమాలో తెలుగులో స్టార్ హీరో అయిన బాలయ్య బాబు అలాగే తమిళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న కమల్ హాసన్ ఇందులో గెస్ట్ అప్పీరియన్స్ లో కనిపించబోతున్నారట. అయితే వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి స్క్రీన్ మీద సందడి చేస్తారట. కమల్ హాసన్ బాలయ్య ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో సందడి చేయబోతున్నారు.
మొత్తానికైతే బాలయ్య, కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వడానికి ఈ సినిమాలో ఒక ప్రాపర్ సీన్ అయితే రాసుకున్నారట. అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ న్యూస్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ గెస్ట్ అప్పిరియన్స్ మీద పలు వార్తలైతే వస్తున్నాయి…
