Allu Arjun New Movie Title: ‘పుష్ప 2’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలైన ఈ సినిమా , ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి టాప్ హీరోయిన్స్ ఇందులో నటిస్తున్నారు. అంతే కాకుండా ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాన ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ లో కనిపించింది. అల్లు అర్జున్ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నాడని టాక్. ఇవన్నీ పక్కన పెడితే ee నెల 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు కాబట్టి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల అవుతుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. కానీ అలాంటివేమీ ప్లాన్ చేయలేదట.
కానీ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని మాత్రం ఏప్రిల్ 8 న విడుదల చేయబోతున్నారట. అందుకు సంబంధించిన అధికారిక అప్డేట్ రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తుంటే , ఈ చిత్రానికి ‘అయాన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ‘అయాన్’ అనేది అల్లు అర్జున్ కొడుకు పేరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో అయాన్ తన చిలిపి చేష్టలతో బాగా పాపులర్ అయ్యాడు కూడా. అయితే ‘అయాన్’ అనే టైటిల్ కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టించారా ?, లేదా కథకు తగ్గట్టుగానే పెట్టించారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రం లో హీరో క్యారెక్టర్ పేరే ‘అయాన్’ అని , అదొక సూపర్ హీరో రోల్ అని అంటున్నారు. దీనికి సమందించిన పూర్తి క్లారిటీ ఏప్రిల్ 8 న రాబోతుంది.
ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ తన కొడుకు పేరిట 2000 కోట్ల గ్రాస్ ని నమోదు చేసినట్టే. ఎందుకంటే ఈ క్రేజీ చిత్రానికి ఆ రేంజ్ మార్కెట్ ఉంది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ చిత్రం 1500 కోట్ల మార్కుని అందుకోగలదు. గ్లింప్స్ వీడియో ని కూడా రెడీ చేసి ఉంచారట కానీ , సినిమా పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది, అప్పుడే అంత ప్రమోషనల్ కంటెంట్ వదలడం ఎందుకు అని అల్లు అర్జునే ఆపించాడట. మరోపక్క ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందేమో అని అభిమానులు అనుకున్నారు కానీ, అలాంటివేమీ ప్లానింగ్ లో లేదట. కేవలం అట్లీ సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రమే అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు రాబోతుంది.