Allu Arjun as Karna: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వాళ్ళందరి చూపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మీదనే ఉంది. ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఇండియా వైడ్ గా ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ క్యూలు కడుతున్నారు. ఇప్పటికే ఆయన అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లాంటి డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకున్నాడు. వీళ్ళ సంగతి పక్కన పెడితే రాజమౌళి తదుపరి చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుసగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత పొటెన్షియల్ ఉన్న సినిమాలను ఒప్పుకుంటూ ఫ్యాన్స్ కి తిరుగులేని ఫ్యాన్ మూమెంట్స్ ఇస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మహాభారతం లోని కర్ణుడి క్యారక్టర్ పై సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా(Rakesh OM Prakash Mehra) ఎప్పటి నుండో ‘కర్ణ’ అనే ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకుంటూ ఉన్నాడు. అప్పట్లో తమిళ హీరో విక్రమ్ తో చెయ్యాలని చూసారు. కానీ ఆయన వరుస ఫ్లాప్స్ లో ఉండడం, మార్కెట్ బాగా పడిపోవడం తో ఆయనతో వర్కౌట్ అవధాని వదిలేసాడు. ఈ చిత్రానికి సుమారుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుంది. విక్రమ్ ని పక్కన పెట్టిన తర్వాత సౌత్ లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి సూర్య తో చెయ్యాలని అనుకున్నారు. కానీ సూర్య కూడా ఈమధ్య కాలం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకోవడం తో, ఆయన ప్రస్తుతం మార్కెట్ పై 600 కోట్ల బడ్జెట్ పెట్టాలంటే సాహసమే అని భావించి ఆ ఆలోచన కూడా విరమించుకుని ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ స్క్రిప్ట్ కోసం రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దాదాపుగా ఆరేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు. వ్యాస మహర్షి రాసిన మహాభారతం ని అవపోసన పట్టి ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు. ఇలాంటి భారీ సినిమా నిలబడాలంటే పాన్ ఇండియా లెవెల్ లో మినిమం గ్యారంటీ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ లాంటోళ్ళు కావాలి. ప్రస్తుతానికి ప్రకాష్ మెహ్రా చూపు మొత్తం అల్లు అర్జున్ వైపే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ వేల్యూ ని సంపాదించుకుంది అల్లు అర్జునే. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఆయన తక్కువలో తక్కువ పెట్టిన బడ్జెట్ ని రీకవర్ చేయగల సూపర్ స్టార్ స్టేటస్ ఉంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి.