Allu Arjun and Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించే సినిమాలు సూపర్ హిట్ సక్సెస్ ను అందుకుంటాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు శ్రీనివాస్ సినిమాలపై అంచనాలు మరో రేంజ్ లో ఉంటాయి. ఇక ఈ దర్శకుడు, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే సినిమాల గురించి మరింత వెయిట్ చేస్తుంటారు అభిమానులు.
ఈ ఇద్దరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలు కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇలా హ్యాట్రిక్ హిట్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అప్పటి నుంచి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా విషయంలో తాజాగా స్టోరీ గురించి ఒక అప్డేట్ వైరల్ అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న ఈ సినిమా స్టోరీ కూడా జబర్దస్త్ గా ప్లాన్ చేశారట. పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేశారట త్రివిక్రమ్.
అయితే ఈ సినిమా భారత స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో జరిగే డ్రామా అని టాక్. స్టోరీ లైన్ నే ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఇక త్రివిక్రమ్ తన మేకింగ్ తో సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళతాడో వేచి చూడాల్సిందే. అంతేకాదు ఈ సినిమాకు ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 4వ సారి రాబోతున్న ఈ కాంబోను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నారు.