Allu Arjun- Sreeleela: గత కొంత కాలంగా ఆహా మీడియా లో అల్లు అర్జున్ ఒక సరికొత్త ఒరిజినల్ మూవీ, కేవలం ఓటీటీ వెర్షన్ కోసం చెయ్యబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆహా మీడియా కూడా ప్రచారం చేసే విధానం అలాగే ఉండింది. అల్లు అర్జున్ ఆహా మీడియా ఓటీటీ లో నిజంగానే సినిమా చేయబోతున్నాడని, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అని చెప్పుకొచ్చారు.అంతే కాదు అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల కూడా చిందులు వెయ్యడం తో అభిమానులందరూ ఇది నిజమే అని అనుకున్నారు. ఈ సినిమా పేరు ‘అర్జున్ లీల’ అని కూడా ప్రచారం అయ్యింది. సినిమా పేరు అర్జున్ లీల అనేది నిజమే, కానీ ఇదంతా సినిమా కాదు, అదే అసలు సిసలు ట్విస్ట్.
ఈ ‘అర్జున్ లీల’ అనేది కేవలం ఆహా మీడియా కోసం చేసిన యాడ్ వీడియో అట. ఇన్ని రోజులు నిజంగానే వీళ్లిద్దరు కలిసి ఆహా మీడియా లో నటించారా, అంత పెద్ద స్టార్స్ ఓటీటీ లో ఎందుకు చేస్తారు?, ఇలాంటి సందేహాలు కొంతమంది అభిమానుల్లో ఉండేవి. కానీ ఆహా మీడియా ఇచ్చిన బిల్డప్ ని చూసి నిజంగానే సినిమా అని అనుకోని మోసపోయారు ఫ్యాన్స్. దీనిపై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో ‘పుష్ప : ది రూల్’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో విడుదలై ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా, సమ్మర్ కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.