Allu Arjun and Shah Rukh Khan Combination Add
Allu Arjun and Shah Rukh Khan Combination Add : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం టాప్ 2 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు చెప్పమంటే మనకి షారుఖ్ ఖాన్ తో పాటు గుర్తుకు వచ్చే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ కంటే పెద్ద హీరో అనొచ్చు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ క్రేజ్ కేవలం నార్త్ ఇండియా వరకు మాత్రమే పరిమితం. కానీ అల్లు అర్జున్ కి సౌత్ స్టేట్స్ లో ఎంత క్రేజ్ ఉందో, బాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇక నుండి ఆయన సినిమాలు ఏది హిట్ అయినా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతాయి. ఆ స్థాయికి ఎదిగిపోయాడు. కానీ షారుఖ్ ఖాన్ నటించే అన్ని సినిమాలకు వెయ్యి కోట్లు వస్తుందా అంటే అనుమానమే. ఉదాహరణకి ఆయన నటించిన జవాన్, పఠాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి.
కానీ ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన ‘డుంకీ’ చిత్రం మాత్రం కేవలం 500 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ అల్లు అర్జున్ కి అలాంటి పరిస్థితులు లేవు. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఎన్నో ఆలోచనలు చేస్తున్నారని వినికిడి. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే వసూళ్ల పరంగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ అయ్యినట్టే. భవిష్యత్తులో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో అనేది ఇప్పుడే చెప్పలేము కానీ, అతి త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక యాడ్ మాత్రం రాబోతుంది. ఈ యాడ్ వీడియో లో నటించేందుకు ఇరువురు హీరోలు కూడా అంగీకరించారు. సౌత్ ఇండియా లో ‘థమ్స్ అప్’ యాడ్ కి అల్లు అర్జున్ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2 ‘ విడుదల తర్వాత ఈ యాడ్ ప్రసారమైంది.
బాలీవుడ్ లో ఈ యాడ్ కి షారుఖ్ ఖాన్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. వీళ్లిద్దరి కలయిక లో త్వరలోనే ఒక ‘థమ్స్ అప్’ యాడ్ ని షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట యాజమాన్యం. ఈ యాడ్ కి ఒక ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడని తెలిసింది. ఈ యాడ్ వీడియో ఇరువురి హీరోల అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుందని టాక్. వచ్చే నెలలో ఈ యాడ్ షూటింగ్ జరగనుంది అట. మార్చి నెలలో మనకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ కాంబినేషన్ కెమిస్ట్రీ ఎలా కుదరబోతుంది అనేది. గతం లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం లో అల్లు అర్జున్ కి చిన్న అతిథి రోల్ లో కనిపించే అవకాశం దక్కింది. కానీ ఆయన ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు. ఎట్టకేలకు అప్పుడు మిస్ అయినా ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయ్యింది.