Allu Arjun And Pushpa Makers: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. AI ని ఉపయోగించి నిజమైన వీడియో లాగా కొంతమంది ఎడిట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్న వీడియోలను చూసి జనాలు ఇది నిజమా, కాదా అనే అయ్యోమయ్యం లో పడుతున్నారు. కానీ ట్విట్టర్ లో ‘GROK’ అనే అద్భుతమైన ఫీచర్ ఒకటి ఈమధ్య కాలం లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఏది నిజం, ఏది అబద్దం అనేది కనిపెట్టేయొచ్చు. కేవలం ‘GROK’ ని ట్యాగ్ చేసి అడిగితే చాలు అంతే. అయితే రీసెంట్ గా పుష్ప మేకర్స్ ట్విట్టర్ లో అమెరికా’స్ గాట్ టాలెంట్ అనే షోలో ‘B Unique Crew’ పుష్ప(Pushpa Movie) చిత్రం లోని ‘దాక్కో దాక్కో మేక’ పాటకు ప్రదర్శన ఇచ్చారని ఒక వీడియో ని అప్లోడ్ చేశారు.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ఈ వీడియో ని చూసి ట్విట్టర్ లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కూడా పెర్ఫార్మ్ చేసిన వారికి అభినందనలు తెలిపాడు. ఈ ప్రదర్శన చూసిన తర్వాత జడ్జీలు కూడా ఈ సీజన్ లో ఇదే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఫేక్ ఎడిటెడ్ వీడియో అని GROK తేల్చి చెప్పేసింది. ఎవరో AI ని ఉపయోగించి ఈ వీడియో ని మ్యానిప్యులేట్ చేశారని, యూట్యూబ్ లో ఒరిజినల్ వీడియో కూడా అందుబాటులో ఉందని, ఆ వీడియోలో ఎక్కడా కూడా పుష్ప చిత్రం సాంగ్ ని అనుకరించినట్టు లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో మేకర్స్, అల్లు అర్జున్ ఆడియన్స్ ని ఫేక్ ఎడిటెడ్ వీడియో ద్వారా తప్పుదోవ పట్టించారని, ఈ స్థాయికి వచ్చి కూడా ఇవేమి పనులు అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ఇది కచ్చితంగా అల్లు అర్జున్ కి మరియు పుష్ప మేకర్స్ కి తెలియకుండా జరిగిన పని అయ్యుంటుందని అంతా అనుకుంటున్నారు.
వీడియో కూడా చూసేందుకు ఒరిజినల్ లాగా ఉండడం తో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చని, అందుకే ఈ పొరపాటు జరిగిందని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు. నిన్న మొత్తం ఈ అంశం ట్విట్టర్ లో పెద్ద దుమారమే రేపింది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, శరవేగంగా షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తుండగా విలన్ గా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తుంది. సూపర్ హీరో జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Icon Star @alluarjun‘s #Pushpa is a global phenomena
The ‘B Unique Crew’ performed for the #Pushpa song on @AGT Season 20 stage and the response was sensational
The judges hailed it as ‘THE BEST PERFORMANCE OF THE SEASON’ ❤️pic.twitter.com/Nx1Zcfpyfw
— Pushpa (@PushpaMovie) August 4, 2025