Allu Arjun Lokesh Kanagaraj movie teaser: సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరినే లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ‘కూలీ’ తర్వాత మన టాలీవుడ్ స్టార్ హీరోతో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో చేయబోతున్నాడని కొందరు, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో చేయబోతున్నాడని మరికొందరు ప్రచారం చేశారు. ఈ విషయం లో కాస్త అభిమానుల్లో గందరగోళం మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ గందరగోళానికి నేటి తో తెరపడింది. కాసేపటి క్రితమే లోకేష్ కనకరాజ్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్టు అధికారికంగా ఒక వీడియో ద్వారా ప్రకటించాడు. ఈ సినిమా కాన్సెప్ట్ ని తెలిపే విధంగా కట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ వీడియో ప్రకారం అల్లు అర్జున్ ఇందులో కౌ బౌయ్ పాత్ర పోషించబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన గుర్రం మీద స్వారీ చేయడం, అదే విధంగా అడవిలో రకరకాల క్రూర జంతువులను చూపించడం చూస్తుంటే కచ్చితంగా కౌ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ జానర్ ఎందుకో మన టాలీవుడ్ కి పెద్దగా కలిసిరాలేదు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే కౌ బాయ్ చిత్రం చేసి భారీ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘కొదమ సింహం’ చిత్రం లో కౌ బాయ్ పాత్ర పోషించాడు. ఈ సినిమా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇక నేటి జెనెరేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ చిత్రం లో కౌ బాయ్ క్యారెక్టర్ చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇలా ఈ జనార్ లో అత్యధిక శాతం ఫ్లాపులు, యావరేజ్ సినిమాలే ఉన్నాయి. మరి అలాంటి జానర్ ని ఎంచుకున్న లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్ తో సక్సెస్ కొడతాడా లేదా అనేది చూడాలి. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈ యానిమేషన్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుందని చెప్పుకొచ్చాడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ నెలకు పూర్తి అవుతుంది . ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన అల్లు అర్జున్ సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు.
Blessed with the best @alluarjun #AALoki
Looking forward to kicking off this journey with you sir
Let’s make it a massive blast
Once again with my brother @anirudhofficial #AA23 #LK7 @MythriOfficial pic.twitter.com/AZpufiNI2t— Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 14, 2026