Allu Arjun-Koratala Siva : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్రం తో ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన కళ్లారా చూసాము. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుందంటే, ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభం నుండి అల్లు అర్జున్ ఎదుగుదల ఒక్కో మెట్టు ఎక్కుతున్నట్టే ఉంది కానీ, ఒకేసారి వంద మెట్లు ఎక్కినట్టు ఎప్పుడూ లేదు. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రానికి ముందు అల్లు అర్జున్ కేవలం ఒక మామూలు హీరో మాత్రమే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆయన్ని ఎలైట్ హీరోల క్లబ్ లోకి చేరేలా చేసింది. ఆ తర్వాత విడుదలైన పుష్ప చిత్రం ఆయన్ని పాన్ ఇండియా హీరోని చేయగా, రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ‘ చిత్రం ఆయన్ని ఇంటర్నేషనల్ హీరో గా నిలబెట్టింది.
ఇప్పుడు అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా అది బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే అని ఆడియన్స్ ముందుగా ఫిక్స్ అయిపోతున్నారు. డైరెక్టర్స్ ఫేమ్ తో సంబంధం లేకుండా, పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప స్థాయి సంచలనాలు సృష్టించే సత్తా అల్లు అర్జున్ లో ప్రస్తుతం ఉంది. అయితే పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అయితే ఈ చిత్రాలతో పాటు ఆయన కొరటాల శివ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ గా వార్తలు వినిపించాయి. రీసెంట్ గానే కొరటాల శివ అల్లు అర్జున్ ని కలిసి స్టోరీ వినిపించాడు.
ఉత్తర్ ప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్టు ని ఆయన అల్లు అర్జున్ కి వినిపించాడు. స్టోరీ అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో వెంటనే బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేయాల్సిందిగా చెప్పుకొచ్చాడు. వాస్తవానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘దేవర’ చిత్రం రావాల్సింది. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. కానీ అల్లు అర్జున్ తన పూర్తి ఫోకస్ పుష్ప మీద పెట్టడంతో ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి ప్రారంభంలో డివైడ్ టాక్ వచ్చింది కానీ, ఆ తర్వాత ఆడియన్స్ ఈ చిత్రాన్ని అమితంగా ఇష్టపడడం మొదలెట్టారు. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.