Allu Arjun And Atlee: పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అదరిస్తుంది… ప్రస్తుతం అతనికి నార్త్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ దర్శకులు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మాత్రం సౌత్ సినిమా దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే బాలీవుడ్ దర్శకులు ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఇక అందులో భాగంగానే పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ ఆయన్ని పక్కనపెట్టి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ తో సినిమా చేస్తున్నాడు. విజువల్ వండర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండబోతుందట. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే తమిళ్ ఇండస్ట్రీలోని ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా మీద మాకు నమ్మకం లేదు అంటూ తేల్చి చెప్పేస్తున్నారు.
కారణం ఏంటి అంటే అట్లీ ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా ఇతర సినిమాల నుంచి రిఫరెన్సులుగా కొన్ని సన్నివేశాలను తీసుకొని వాటిని వాడుకొని సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఆ సినిమాలు సక్సెస్ లను సాధించినప్పటికి ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ ఎందుకని అట్లీకి సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.
అతని ఇమేజ్ ని మ్యాచ్ చేసే విధంగా అట్లీ సినిమా చేయగలుగుతాడా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీద తమిళ్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేనట్టుగా తెలుస్తున్నాయి… ఇక ఇప్పటివరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడం లేదు.
తమిళ దర్శకులు ఇతర హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలను రాబడుతున్నారు. కానీ తమిళ హీరోలతో చేసిన సినిమాలకు మాత్రం ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. చిన్న హీరోల దగ్గరి నుంచి రజనీకాంత్ వరకు ప్రతి ఒక్కరు ఎలాంటి సాహసాలు చేసిన కూడా వాళ్ళు 1000 కోట్ల మార్క్ ను మాత్రం అందుకోలేకపోవడం విశేషం…