Allu Arjun: బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టి అల్లు అర్జున్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గతేడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలవైకుంఠపురములో’ మూవీతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్టందుకున్నారు. ఇక ఏడాదిలో డిసెంబర్లో ‘పుష్ప’ను రిలీజ్ చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన ‘పుష్ఫ’ ప్రస్తుతం 300కోట్ల మార్క్ కలెక్షన్ దిశగా పరుగులు పెడుతుండం విశేషం.
అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీలో వంద కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. దీంతో బాలీవుడ్ లోనూ తిరుగులేని స్టార్ గా బన్నీ ఎదిగిపోయాడు. తెలుగు, తమిళ్, మలయాళంలో ‘పుష్ప’ లాభాల్లోకి వెళ్లడంతో బన్నీ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ‘పుష్ప ది రైజ్’ హిట్టుతో సుకుమార్ ‘పుష్ప ద రూలర్’ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.
కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ‘పుష్ప-2’ పట్టాలెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ‘పుష్ప’తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న బన్నీ సోషల్ మీడియాలో అరుదైన రికార్డును నమోదు చేశాడు. 2022 సంక్రాంతి నాటికి ఇన్ స్ట్రాగ్రామ్ లో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 15మిలియన్లకు చేరింది. సౌత్ ఇండియాలో ఇంత మంది ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా బన్నీనే కావడం విశేషం.
తన ఫాలోవర్స్ 15మిలియన్లకు చేరడంపై అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశాడు. తనపై ఫ్యాన్స్ అమితమైన ప్రేమ చూపిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్వీటర్లో అల్లు అర్జున్ కు ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్, ఫేస్ బుక్‌లో 21మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. బన్నీ తర్వాత ప్లేసులో విజయ్ దేవరకొండకు ఇన్‌స్టాలో 14.2మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.