Allu Arjun: కోట్ల రూపాయలు ఉన్నా సాయం చేయాలనే మనసు కూడా ఉండాలి. లేదంటే ఎంత పెద్ద కోటీశ్వరులు కూడా ఒక్క రూపాయి ఇతరులకు ఊరికే ఇవ్వడానికి ఇష్టపడరు. టాలీవుడ్ హీరోలు మాత్రం ఈ విషయంలో ముందుంటారు. విపత్తుల సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా మన హీరోలు తమ వంతు ఆర్థిక సాయం అందించారు. తాజాగా అల్లు అర్జున్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఒక స్టూడెంట్ ని దత్తత తీసుకున్నారు. కేరళకు చెందిన ఒక నర్సింగ్ స్టూడెంట్ కోవిడ్ మహమ్మారి కారణంగా తండ్రిని కోల్పోయింది.

తండ్రి మరణించడంతో ఆ స్టూడెంట్ అనాథగా మారింది. నర్సింగ్ కోర్స్ లో సీటు సంపాదించి కూడా ఫీజులకు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక చదువు మానేసే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం అలెప్పి కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. ఆయన కోవిడ్ కారణంగా కుటుంబ పెద్దలను కోల్పోయి అనాథలైన వారి కోసం ఫండ్ రైజ్ చేస్తున్నారు. తండ్రిని కోల్పోయిన విద్యార్థిని గురించి తెలుసుకున్న కలెక్టర్ హీరో అల్లు అర్జున్ ని ఆశ్రయించారు. సదరు స్టూడెంట్ చదువుకోవడానికి ఏడాది ఫీజు చెల్లించాలని కోరారు.
దానికి అల్లు అర్జున్ ఏడాది కాదు… ఆమెను చదువు పూర్తి అయ్యే వరకు మొత్తం బాధ్యత నాదే అని చెప్పారు. ఫీజులు, బట్టలు, పుస్తకాలు, హాస్టల్ వసతికి అవసరమయ్యే ఖర్చు నేనే భరిస్తానని హామీ ఇచ్చారట. దీంతో సదరు విద్యార్థినితో పాటు కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఔదార్యానికి అందరూ భేష్ అంటున్నారు. అల్లు అర్జున్ రియల్ హీరో అనిపించారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పరిశ్రమలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

మరో వైపు పుష్ప 2 షూట్ కి అల్లు అర్జున్ సిద్ధం అవుతున్నారు. ఫస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ దేశంలోని దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారట. సుకుమార్ అక్కడ లాంగ్ షెడ్యూల్ నిర్వహించనున్నాడని సమాచారం. రెడ్ శాండల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప భారీ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ కావడంతో పార్ట్ 2 రెట్టింపు బడ్జెట్ తో ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.