Allu Aravind : అల్లు అర్జున్ అరెస్ట్ సమయం లో తండ్రి అల్లు అరవింద్ ఎంత ఆవేదనకు గురయ్యాడో మన అందరికీ తెలిసిందే. అరెస్ట్ తర్వాత జరిగిన అనేక పరిణామాలకు ఆయన ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఒకానొక దశలో మీడియా ముందు కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టాల్సిన అవసరం కూడా లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతా మామూలు పరిస్థితులు రావడంతో అల్లు అరవింద్ కూడా నార్మల్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన నిర్మాణం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం ఫిబ్రవరి 7 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కారణం ‘బుజ్జి తల్లి’ అనే పాట సెన్సేషనల్ హిట్ అవ్వడమే.
యూట్యూబ్ లో ఈ పాటకు 50 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం ఈ ఒక్క పాట వల్ల మాత్రమే కాదు. లవ్ స్టోరీ చిత్రం తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడం, ‘కార్తికేయ 2 ‘ వంటి బంపర్ హిట్ తర్వాత డైరెక్టర్ చందు మొండేటి నుండి తెరకెక్కించిన సినిమా కావడం, శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తీసుకొని, ఆసక్తికరమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన చిత్రం కావడం తో ఈ మూవీ పై అంచనాలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి. ఇకపోతే నిన్న ఈ సినిమాకి సంబంధించిన రెండవ లిరికల్ సాంగ్ ‘హైలెస్సో..హైలెస్సా’ విడుదలైంది. ఈ పాటని ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి హీరో నాగ చైతన్య, నిర్మాత అల్లు అరవింద్ తో పాటు మూవీ టీం మొత్తం హాజరైంది.
ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఉత్సాహంగా అక్కడికి వచ్చిన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేయడం హైలైట్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో అల్లు అరవింద్ ఉత్సాహాన్ని చూసిన తర్వాత పర్వాలేదు, అల్లు అరవింద్ గారు తేరుకొని మామూలు స్థితికి వచ్చేసారు అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 2 వ తేదీన నిర్వహిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ముఖ్య అతిథి గా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు అయితే పిలవగానే వచ్చి ప్రోత్సహించేవాడు కానీ, ఇప్పుడు వస్తాడా లేదా అనేది డౌట్ గా మారింది. జరిగిన సంఘటనల కారణంగా కొంతకాలం ఆయన ఇలాంటి ఈవెంట్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
