Allari Naresh Ugram: కామెడీ సినిమాలకు అల్లరి నరేష్ పెట్టింది పేరు. రాజేంద్రప్రసాద్ తరువాత హీరో లెవల్లో కామెడీ చేసే నటుడంటే ఈయన పేరే చెప్పుకునే వారు. కానీ ఆయన తన రూట్ మార్చాడు. ఇప్పుడు యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. కొందరు నటులు కమెడియన్లుగా రాణించి ఆ తరువాత మాస్ హీరోగా ట్రై చేశారు. కానీ సక్సెస్ కాలేదు. అల్లరి నరేశ్ కామెడీతో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేయగలనని నిరూపిస్తున్నాడు. ఆ విషయాన్ని ‘నాంది’ సినిమాతో నిరూపించాడు. ఇప్పుడు అదే బాటలో మరో క్రైం థిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఆదే ‘ఉగ్రం’. ‘నాంది’ సినిమా చేసిన డైరెక్టర్ విజయ్ కనకమేడల.. మరోసారి నరేష్ తో కలిసి ‘ఉగ్రం’ తీస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లోకి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.

సూపర్ కామెడీ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన కుమారులతో కూడా హ్యూమర్ టచ్ సినిమాలు చేయించి ఆకట్టుకున్నాడు. ఆ ఇద్దరిలో ‘అల్లరి’ నరేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కితకితలు’, ‘సీమ టపాకాయ్’, ‘కెవ్వు కేక’ లాంటి సినిమాలతో నరేష్ స్టార్ అయిపోయాడు. అయితే ఇవివి ఈ లోకాన్ని విడిచిన తరువాత నరేశ్ తో కామెడీ సినిమాలు చేసేవారు కరువయ్యారు. దీంతో ఆయన సినిమాలు ఎక్కువగా రావడం లేదు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం వినియోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో ప్రయోగాత్మకంగా ‘నాంది’ సినిమాలో నటించారు. ఇందులో మాసివ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అల్లరి చేసే నరేష్ ఒక్కసారిగా యాక్షన్ హీరో అయ్యాడు. దీంతో నరేష్ తో ఇటువంటి సినిమాలు కూడా చేయొచ్చని కొందరు డైరెక్టర్ల మనసు దోచుకున్నాడు. అయితే మరోసారి ‘నాంది’ డైరెక్టర్ నరేశ్ తో ‘ఉగ్రం’ తీశాడు. ఈ సినిమా కూడా భారీ యాక్షన్ తో కూడుకున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

విజయ్ కనకాల ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తరువాత కొంత మంది హీరోలను కలిశాడట. అయితే ఎవరి డేట్స్ కుదరకపోవడంతో తిరిగి నరేష్ ను కలిశాడు. దీంతో ఆయన ఒకేచెప్పడంతో సినిమా షూటింగ్ సీక్రెట్ కు స్ట్రాటయింది. ఎవరికీ తెలియకుండానే 60 శాతం పూర్తి చేసుకుంది. సంక్రాంతి వరకు సినిమాను రెడీ చేసి ఫిబ్రవరి 10న థియేటర్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. నరేష్ అంతుకుముందు నటించిన ‘నాంది’ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది కూడా సక్సెస్ అవుతుందని డైరెక్టర్ ఆశిస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్లు ‘ఉగ్రం’ సక్సెస్ అయితే అటు డైరెక్టర్.. ఇటు హీరో నరేష్ కు ఇక తిరుగులేనట్లే..