https://oktelugu.com/

Allari Naresh: పాములకు భయపడి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ని వదిలేసుకున్న అల్లరి నరేష్.. బ్యాడ్ లక్ అంటే ఇదే!

నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ సినిమా తొలుత అల్లరి నరేష్ చెయ్యాల్సింది అట.డైరెక్టర్ చందు మొండేటి ముందుగా కథ ఆయనకే వినిపించాడట.కథ మొత్తం నచ్చింది కానీ, ఇందులో పాములు ఉండడం వల్ల వదిలేసుకున్నాడట. నిజమైన పాములతో చాలా సన్నివేశాలు ఉంటాయని చెప్పాడట డైరెక్టర్. చిన్నతనం నుండి పాములంటే చచ్చేంత భయం ఉన్న అల్లరి నరేష్ ఈ సినిమా చెయ్యలేను అని చెప్పాడట.

Written By:
  • Vicky
  • , Updated On : May 15, 2023 / 03:23 PM IST

    Allari Naresh

    Follow us on

    Allari Naresh: అల్లరి నరేష్ కామెడీ హీరో గా మాత్రమే కాదు, సీరియస్ రోల్స్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించగలడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో సార్లు అది రుజువు అయ్యింది కూడా. రీసెంట్ గా ఆయన ‘ఉగ్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అల్లరి నరేష్ కి నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

    ఆయన లో ఇంత మాస్ యాంగిల్ ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేసింది ఈ చిత్రం. అయితే అల్లరి నరేష్ కి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని కేవలం పాములు ఉన్నాయి అనే కారణం తోనే వదిలేసుకున్నాడట. ఆయన అలా వదులుకున్న చిత్రం పేరు ‘కార్తికేయ’. ఈ సినిమా హీరో నిఖిల్ కెరీర్ లో ఎంత ప్రత్యేకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతోనే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

    నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ సినిమా తొలుత అల్లరి నరేష్ చెయ్యాల్సింది అట. డైరెక్టర్ చందు మొండేటి ముందుగా కథ ఆయనకే వినిపించాడట.కథ మొత్తం నచ్చింది కానీ, ఇందులో పాములు ఉండడం వల్ల వదిలేసుకున్నాడట. నిజమైన పాములతో చాలా సన్నివేశాలు ఉంటాయని చెప్పాడట డైరెక్టర్. చిన్నతనం నుండి పాములంటే చచ్చేంత భయం ఉన్న అల్లరి నరేష్ ఈ సినిమా చెయ్యలేను అని చెప్పాడట.

    దాంతో ఈ ప్రాజెక్ట్ అల్లరి నరేష్ చేతి నుండి, హీరో నిఖిల్ చేతికి వెళ్ళింది. కార్తికేయ చిత్రం నిఖిల్ ని ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా నిలబెడితే, కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యి, నిఖిల్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాని అల్లరి నరేష్ వదులుకోవడం నిజంగా ఆయన దురదృష్టమే!.