Ugram Collections: అల్లరి నరేష్ కామెడీ సినిమాలను కాస్త పక్కన పెట్టి కాస్త విభిన్నమైన పాత్రలతో ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ఉండే లోపు నరేష్ సినిమాలంటే ఒకానొక దశలో ఆడియన్స్ కి చిరాకు కలిగింది. ఆ సమయం లోనే ఆయన రూట్ మార్చి ‘నాంది’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యింది.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన మరో ప్రయత్నం ‘మారేడుమల్లి నియోజకవర్గం’ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినప్పటికీ , నరేష్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక రీసెంట్ గా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల తో నరేష్ మరోసారి నటించిన ‘ఉగ్రం’ చిత్రం రీసెంట్ గానే విడుదలై ఆడియెన్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కేవలం 61 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. కానీ రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా 67 లక్షల రూపాయిల వరకు షేర్ ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు కలిపి కోటి 48 లక్షల రూపాయిల షేర్ రాగ, మూడవ రోజు దాదాపుగా 63 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.
అలా మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల రూపాయలకు జరిగింది. ఈరోజు నుండి డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకి పోతే ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.