Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎట్టకేలకు 15 వారాలు పూర్తి చేసుకొని గ్రాండ్ ఫినాలే కి అడుగుపెట్టింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి టైటిల్ విన్నర్ విషయం లో ఒక రేంజ్ ఉత్కంఠ నెలకొంది, ఇంతకు ముందు సీజన్స్ లో టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపై నాలుగు వారాల ముందే స్పష్టత ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం నిఖిల్, గౌతమ్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఏర్పడింది. వీళ్లిద్దరికీ సరిసమానమైన ఓటింగ్ వచ్చిందట. ఆన్లైన్ ఓట్లు నిఖిల్ కి ఎక్కువ ఉంటే, మిస్సెడ్ కాల్స్ ఎక్కువగా గౌతమ్ కి వచ్చాయట. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అనేది కాసేపట్లో తెలియనుంది. ఇది కాసేపు పక్కన పెడితే నేడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. కేవలం విష్ణు ప్రియ, హరి తేజ, నయనీ పావని మాత్రమే హాజరు కాలేకపోయారు.
వీళ్లంతా వచ్చిన తర్వాత నాగార్జున మీ దృష్టిలో ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అని అడుగుతాడు. కొంతమంది నిఖిల్, నబీల్ పేర్లు చెప్తే ఎక్కువ శాతం మంది గౌతమ్ పేరు చెప్తారు. టేస్టీ తేజ, మెహబూబ్ , మణికంఠ, రోహిణి తదితరులు గౌతమ్ పేర్లు చెప్తారు. టేస్టీ తేజ నాగార్జున ని ప్రశ్న అడుగుతూ మీ దృష్టిలో ఎవరు విన్ అవుతారు సార్ అని అడగగా, దానికి నాగార్జున ఏంటి అని సీరియస్ గా సమాధానం చెప్తాడు. ఇక గంగవ్వ తో నాగార్జున సరదాగా మాట్లాడగా, గంగవ్వ తేజ గురించి చెప్తూ వీడు పెట్టిన పోహా వల్లే నా ఆరోగ్యం చెడిపోయింది. అందుకే ఎలిమినేట్ అయ్యాను అంటుంది. అయితే ఈమెని మాత్రం నాగార్జున నీకు ఎవరు విన్ అవ్వాలని ఉంది అని అడగలేదు. అలా యష్మీ, పృథ్వీ, బెబక్క, శేఖర్ బాషా, ఆదిత్య ఓం వీళ్ళని ఎవరు విన్ అవుతారు అనేది అడగలేదు నాగార్జున.
ఇది కాస్త చూసే ఆడియన్స్ కి నిరాశ కలిగించే విషయం అని చెప్పొచ్చు. సీజన్ మొత్తం సగం సగం పనులే చేసుకుంటూ వచ్చారు, చివైరికి గ్రాండ్ ఫినాలే కి కూడా అలాగే చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. టేస్టీ తేజ తో నాగార్జున జరిపిన సంభాషణ చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. మిగిలిన కంటెస్టెంట్స్ తో ఎందుకో పెద్దగా మాట్లాడినట్టు అనిపించలేదు.