Amir Khan: మహాభారతం స్టోరీ గురించి ఎన్ని విన్నా, ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి కథ ఒక్కో బాహుబలి లాంటిది. ప్రతీ ఘట్టం ఊహించుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇక వెండితెర మీద భారీ గ్రాఫిక్స్ తో, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిస్తే ప్రేక్షకులు మెంటలెక్కిపోతారు అనడంలో అతిశయోక్తి లేదేమో. రాజమౌళి(SS Rajamouli) కి మన మహాభారతం తెరకెక్కించాలి అనేది డ్రీం ప్రాజెక్ట్. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Amir Khan) కి కూడా ఇది డ్రీం ప్రాజెక్ట్. రాజమౌళి కంటే ముందే ఆయన ఈ సినిమాని ప్రకటించాడు. అమీర్ ఖాన్ సినిమా అంటే పర్ఫెక్షన్ కి మారు పేరు. సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు ఆయన. అలాంటి హీరో ఒక ప్రాజెక్ట్ మీద ఇంత శ్రద్ద చూపిస్తున్నాడు అంటే ఇక ఔట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
Amir Khan
ఆయన మాట్లాడుతూ ‘మహాభారతం కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది మన పురాణం కి సంబంధించిన కథ కాబట్టి, చాలా పరిశోధనలు చేస్తున్నాం. సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఇండియన్ ప్రేక్షకులకు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకం గా ఈ సినిమా నిలబడాలని మా తాపత్రయం. కచ్చితంగా అలాంటి కంటెంట్ ని అందిస్తాము అనే నమ్మకం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా చెప్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే అమీర్ ఖాన్ తన తోటి సూపర్ స్టార్స్ అయినటువంటి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్(Sharukh Khan) ని కలిసాడు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళని ఎందుకు కలిశారు, మహాభారతం లో రోల్స్ కోసం కలిసారా అని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అమీర్ ఖాన్ ని అడిగారు.
దానికి ఆయన సమాధానం చెప్తూ ‘వాళ్లిద్దరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు, చాలా రోజులైంది కలిసి. అందుకే ఈమధ్య ప్రత్యేకంగా కలిసాము. మీరంతా మా గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మేము మీ గురించి గాసిప్స్ మాట్లాడుకున్నాము కానీ సినిమాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మహాభారతం లో అమీర్ ఖాన్ శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించబోతుండగా, మిగిలిన పాత్రలు కూడా సూపర్ స్టార్స్ మాత్రమే చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్(Global Star Ram charan) ఇందులో అర్జునుడి పాత్రకు ఎంపిక అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా భీముడిగా సల్మాన్ ఖాన్(Salman Khan), కర్ణుడిగా ప్రభాస్, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ వంటి వారు నటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.