Alia Bhatt Pregnant: రణబీర్ కపూర్ – ఆలియా భట్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక్కటి అయ్యారు. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారని తెలుస్తోంది. ఆలియా సోనోగ్రఫీ చేయించుకుంటున్న ఫోటోను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకుంది. అలియా తాను సోనోగ్రఫీ చేయించుకున్న పిక్ తో పాటు “మా బేబీ.. త్వరలోనే” అని మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ఈ జంట ‘వాస్తు’ అనే బంగ్లాలో కాపురం పెట్టారు.
వచ్చే నెలలో రణబీర్ తన తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన ‘కృష్ణ రాజ్’ అనే బంగ్లాకి తన కాపురం మార్చబోతున్నాడు. ‘కృష్ణ రాజ్’బంగ్లా మరమత్తులు పనులు పూర్తి కావడానికి మరో నెల పట్టేలా ఉంది. ఏది ఏమైనా బాలీవుడ్ లోనే క్రేజీ జంటగా ఈ జంటకు నేమ్ ఉంది. రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 60 కోట్లు తీసుకుంటున్నాడు. అలియా ఒక్కో సినిమా 8 కోట్లు డిమాండ్ చేస్తోంది.
Also Read: Venkatesh- Balakrishna: బాలయ్యతో వెంకటేష్ కామెడీ.. ఫన్ లవర్స్ కి ఫుల్ కిక్కే
సంపాదన పరంగానే కాకుండా ఆస్తుల పరంగా లెక్కలు వేసుకున్నా ఈ జంటకి 800 కోట్లు నెట్ వర్త్ ఉంది. ఇక రణబీర్ తో ఐదేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన అలియా.. ఇప్పుడు సంసార బంధంలో అంతకుమించి ప్రేమ ఉంటుందని చెబుతుంది.
మొత్తానికి ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నేళ్లకు పూసింది. ఈ లవ్‌బర్డ్స్ అధికారికంగా ఒక్కటి అవ్వడంతో పాటు త్వరలోనే తల్లిదండ్రులుగా కూడా మారబోతున్నారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇలాగే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని మా ఓకేతెలుగు. కామ్ తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.
Also Read: Jagan Distributing Amaravathi: అమరావతిని పప్పూ బెల్లాల్ల పంచేస్తున్న జగన్