Bollywood: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. కాగా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తెలుగు స్టార్ట్స్ పై క్రేజీ కామెంట్స్ చేస్తోంది. తెలుగు నటీనటులతో కలిసి నటించాలని ఉంది అంటూ కబుర్లు చెబుతుంది. తాజగా ఈ ముద్దుగుమ్మని టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరు ఇష్టమని ఓ యాంకర్ ప్రశ్నించగా, కొద్దిసేపు ఆలోచించిన అలియా సమంత పేరు చెప్పుకొచ్చింది. సామ్ ఒప్పుకుంటే ఆమెతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమని, ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ నటనకు తాను ఫిదా అయ్యానని, అవకాశం వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.

అలియా రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పింది. ‘నన్ను ఇంట్లో ఆలూ అని పిలుస్తారు. పుష్ప సినిమా చూసిన నా కుటుంబ సభ్యులు, ఆలూ.. అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్?’ అని ఆటపట్టిస్తున్నారని వెల్లడించింది. మొత్తానికి ఆలియా, మొహమాటం లేకుండా బన్నీతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యింది.

Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
ఆల్ రెడీ ఈ బ్యూటీ ఎన్టీఆర్‌తో మరో సినిమాలో నటించనుంది. మరి బన్నీతోనూ మూవీ చేసే అవకాశం ఉందో, లేదో చూడాలి మరి. అన్నట్టు ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాను అని అలియా భట్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.’యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాలో.. ఎన్టీఆర్ సరసన ఆలియా హీరోయిన్ గా నటించనుంది.
ఇక బన్నీ పై మిథున్ చక్రవర్తి క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘అయామ్ ఏ డిస్కో డ్యాన్సర్’ అంటూ అప్పటితరాన్ని ఉర్రూతలూగించిన మిథున్ చక్రవర్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే పుష్ప చిత్రం చూశారట. బన్నీ నటనను చూస్తుంటే 80,90ల్లో తన సినిమాలే గుర్తొచ్చాయని, ఇప్పటినుండి బన్నీకి వీరాభిమానిని అయిపోయానని తెలిపారు మిథున్ చక్రవర్తి. తెలుగులో చివరిసారిగా గోపాల గోపాల చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించారు మిథున్.
Also Read: తండ్రిపై ప్రేమతో రవీనా టాండన్ చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు