https://oktelugu.com/

Alia Bhatt: స్టార్ హీరోతో అలియా పెళ్లి కబురు రాబోతుంది

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి గాసిప్ రాయుళ్లు కూడా అలిసిపోయారు గానీ, వీళ్ళు మాత్రం తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించలేదు, పోనీ అటు తొక్కించనూ లేదు. గత మూడేళ్లు నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 25, 2022 / 06:25 PM IST

    Alia Bhatt

    Follow us on

    Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి గాసిప్ రాయుళ్లు కూడా అలిసిపోయారు గానీ, వీళ్ళు మాత్రం తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించలేదు, పోనీ అటు తొక్కించనూ లేదు. గత మూడేళ్లు నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని ఈ లవ్‌బర్డ్స్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    Actress Alia Bhatt

    నిజానికి ఎన్నాళ్లగానో పెళ్లి చేసుకోవాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాగా ఈ జంట 2022లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఈ పుకార్లు రావడానికి ముఖ్య కారణం.. సెలబ్రెటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రాతో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కనిపించింది.

    మనీశ్‌ను పెళ్లి దుస్తుల డిజైన్ కోసమే నీతూ కలసిందని అంటున్నారు. మరోపక్క అలియా – రణబీర్ కపూర్ పెళ్లి వార్తలు చదివి చదివి ప్రేక్షకులు కూడా బాగా నీరసించి పోయారు. చాలాకాలంగా ఇవే వార్తలు రాస్తున్నారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడ్డారు. అయితే, ఈ మధ్య ఈ జంట నిజంగానే తమ పెళ్లి గురించి ఆలోచిస్తోంది.

    అందుకే.. వీరి పెళ్లికి సంబంధించిన వార్తల పై ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా “మా నాన్న గారు జీవించే ఉండి ఉంటే.. మేం ఈపాటికే పెళ్లి చేసుకుని ఒక్కటి అయ్యేవాళ్లం’ అని రణబీర్ కపూర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు.

    Alia Bhatt

    ఇక అప్పటి నుంచి వీరి పెళ్లికి సమయం దగ్గర పడిందనే వార్త బాగా వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ప్రేమ జంట తమ పెళ్లి వేదికను కూడా ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది.

    Tags