Alia Bhatt Unfollowed Rajamouli On Instagram: ఆలియా భట్ కి హిందీ లోకంలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఆమె నేటి మహానటిలా హిందీ ప్రేక్షకులు ఆమెను భావిస్తారు. దానికి తగ్గట్టుగానే తన సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా హిందీ సినీ హృదయాలను ఆకట్టుకుంటూ వస్తోంది ఆలియా భట్. ఎలాగూ గొప్ప నటనా చాతుర్యం ఉంది, బలమైన సినీ నేపథ్యం ఉంది.

అన్నిటికీ మించి హిందీ స్టార్ హీరో రణబీర్ కపూర్ కి కాబోయే సతీమణి. అందుకే.. ఆలియాకి హిందీలో మీడియమ్ రేంజ్ హీరో క్రేజ్ ఉంది. అయితే, ఆ స్టార్ ఇమేజ్ ఉన్నా.. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రల వైపే ఆమె ప్రయత్నాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆలియా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. సీతగా ఆమె ఈ సినిమాలో కనిపించింది.
Also Read: Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్
సినిమా రిలీజ్ కి ముందు అలియా లుక్స్ అండ్ పోస్టర్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. దాంతో సినిమాలో ఆమె పాత్ర పై తెలియకుండానే విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఓ దశలో ఆలియా కూడా ఆర్ఆర్ఆర్ లో తనది చాలా కీలక పాత్ర అని ఫీల్ అయ్యింది. సహజంగా సినిమాని రిలీజ్ కి ముందే జక్కన్న చూపించడు. దాంతో ఆలియాకి కూడా ఈ సినిమాలో తన పాత్ర గురించి సరైన క్లారిటీ లేకుండా పోయింది.
అందుకే.. ఆమె కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ అంచనాల మధ్య సినిమా చూస్తే.. ఏముంది ? ఆలియాది అటు హీరోయిన్ పాత్ర కాదు, ఇటు గెస్ట్ పాత్ర కాదు. మొత్తానికి అటు ఇటు కాకుండా ఏదోకటి అన్నట్టు ఉంది. దాంతో ఆలియా మనసు గాయపడింది అట. అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విజయానికి సంబంధించి ఆలియా థ్యాంక్యూ అని కూడా చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు.

సినిమాలో తనకు స్క్రీన్ స్పేస్ బాగా తక్కువ ఇవ్వడంతో ఆలియా అసంతృప్తిగా ఫీల్ అయ్యింది. ఈ కారణంగానే ఇన్ స్టాగ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేసిందట. పైగా గతంలో షేర్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ పోస్టులను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆమె డిలీట్ చేసింది. మొత్తానికి ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో బాగా ఫీల్ అయ్యింది.
Also Read: Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana: ‘జనగణమన’తో నేలకు దూకుతున్న విజయ్ దేవరకొండ
[…] RRR 5th Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయా ? అంటూ సినిమా విశ్లేషకులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. […]