https://oktelugu.com/

Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ వివాదం పై ‘ఆలియా భట్’ స్పందన

Alia Bhatt: ‘ఆలియా భట్’ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత అనే కీలక పాత్రలో నటించి మెప్పించింది. పైగా సినిమా రిలీజ్ కి ముందు అలియా లుక్స్ అండ్ పోస్టర్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమాలో ఆమె పాత్రకు విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఓ దశలో ఆలియా కూడా ఆర్ఆర్ఆర్ లో తనది చాలా కీలక పాత్ర అని ఫీల్ అయ్యింది. అందుకే.. ఆమె కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది. కాగా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 1, 2022 / 09:42 AM IST
    Follow us on

    Alia Bhatt: ‘ఆలియా భట్’ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత అనే కీలక పాత్రలో నటించి మెప్పించింది. పైగా సినిమా రిలీజ్ కి ముందు అలియా లుక్స్ అండ్ పోస్టర్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమాలో ఆమె పాత్రకు విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఓ దశలో ఆలియా కూడా ఆర్ఆర్ఆర్ లో తనది చాలా కీలక పాత్ర అని ఫీల్ అయ్యింది. అందుకే.. ఆమె కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది.

    Alia Bhatt

    కాగా ఆ అంచనాల మధ్య సినిమా చూస్తే.. తనది అటు హీరోయిన్ పాత్ర కాదు, ఇటు గెస్ట్ పాత్ర కాదు అని ఆలియా ఫీల్ అయ్యిందని వార్తలు వినిపించాయి. మొత్తానికి ఆలియా పాత్ర అటు ఇటు కాకుండా ఏదోకటి అన్నట్టు ఉంది. దాంతో ఆలియా మనసు గాయపడిందని.. అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విజయానికి సంబంధించి చిన్న థ్యాంక్యూ అని కూడా ఆమె మెసేజ్ పెట్టలేదని వార్తలు వచ్చాయి.

    Also Read: Jr.NTR : రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్

    పైగా సినిమాలో తనకు స్క్రీన్‌ స్పేస్‌ బాగా తక్కువ ఇచ్చారనే కోపంతో ఇన్‌ స్టాగ్రామ్‌ లో రాజమౌళిని అన్‌ ఫాలో చేసిందని.. అలాగే గతంలో షేర్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను కూడా ఆమె డిలీట్‌ చేసిందని ప్రచారం జరిగింది. మొత్తానికి ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో బాగా ఫీల్ అయ్యిందని రాజమౌళి వరకూ వెళ్ళింది. దాంతో జక్కన్న ఆలియాతో మాట్లాడి.. ఆమెకు ఆమె పాత్ర వివరించాడట.

    దాంతో మనసు మార్చుకున్న ఆలియా ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపడానికి సోషల్ మీడియాలో ఒక లెటర్ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ లెటర్ లో ఆలియా ఏమి చెప్పింది అంటే.. ఆమె మాటల్లోనే.. “ఇలాంటి అసత్య ప్రచారాల్ని ఆపేయండి. నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తక్కువ పోస్ట్‌లు ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పటికప్పుడు పాత వీడియోలను తొలగిస్తుంటాను.

    Alia Bhatt

    అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ పోస్ట్ లు తొలిగించాను. అంత మాత్రాన ఏదేదో ఆపాదించుకుంటే ఎలా ? నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే ప్రపంచంలో భాగస్వామినవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను పోషించిన సీత పాత్ర నా మనసుకు బాగా దగ్గర అయ్యింది. నేను ఈ పాత్రను ఎంతగానో ప్రేమించాను. అన్నిటికీ మించి రాజమౌళి సర్‌ తో, మరియు తారక్‌, చరణ్‌లతో కలిసి పనిచేయడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రం నాకు మధురానుభూతినిచ్చింది’ అని అలియా భట్‌ లెటర్ లో తెలిపింది.

    Also Read: Toady Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

    Tags