Alia Bhatt- Ranbir Kapoor Wedding: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి గాసిప్ రాయుళ్లు కూడా అలిసిపోయారు గానీ, వీళ్ళు మాత్రం తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించలేదు, పోనీ అటు తొక్కించనూ లేదు. కాకపోతే.. రణబీర్, ఆలియా భట్ పెళ్లి ముహూర్తం ఖరారు అయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది.

అయితే, తాజాగా ఆ రచ్చకు ముగింపు పలకడానికి ఈ క్రేజీ కపుల్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారని.. ఈ నెల మూడో వారంలో రణబీర్ – ఆలియా జంటగా మారబోతున్నారని గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. పైగా ఇప్పటికే అటు రణబీర్ ఇంట్లో, ఇటు అలియా ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయిందని కూడా తెలుస్తోంది.
సరే.. ఈ వార్తల సంగతి పక్కన పెడితే.. అసలు ఆలియా రణబీర్ ను ఏ వయసులో ప్రేమించిందో చెప్పుకొచ్చింది. రణ్‌బీర్ కపూర్‌తో ఆలియా భట్ చిన్నవయసులోనే ప్రేమలో పడింది. చిన్న వయసు అంటే.. రణ్‌బీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజులు అవి. ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ సినిమా కోసం రణబీర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు.
ఆ సినిమాలో క్యారెక్టర్ ఉంది అని చెబితే.. ఆలియా ఆడిషన్స్‌కు వెళ్ళింది. అలా వెళ్లినప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. అక్కడే రణ్‌బీర్‌ను చూసి మనసు పారేసుకుందట ఈ సొట్ట బుగ్గల సుందరి. ఆలియా కంటే ముందే ఈ హీరో కత్రినా కైఫ్ సహా ఐదారు మంది హీరోయిన్లతో ఘాటు ప్రేమాయణం నడిపాడు. అయినా ఆలియా అతన్ని ప్రేమించడం విశేషం.

ప్రస్తుతం ఈ జంట తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. అలాగే రిసెప్షన్ కి వెన్యూ కోసం రణబీర్ ముంబైలో పలు ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ను కూడా ఆల్ రెడీ బుక్ చేశాడని బాలీవుడ్ మీడియా చెబుతుంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ మొత్తానికి ఇన్నాళ్ళకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ జంట తమ పెళ్లికి సినిమా స్టార్స్ ని ఎవరినీ పిలవడం లేదని.. కేవలం కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది.