Homeఎంటర్టైన్మెంట్Alia Bhatt And Bobby Deol: షూటింగ్ స్పాట్ లో 'యానిమల్' విలన్ బాబీ డియోల్...

Alia Bhatt And Bobby Deol: షూటింగ్ స్పాట్ లో ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ తో అలియా భట్ వాగ్వాదం..నిర్మాతకు కోట్లలో నష్టాలు!

Alia Bhatt And Bobby Deol: బాలీవుడ్ లో ధర్మేంద్ర లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాబీ డియోల్(Bobby Deol), మొదట్లో హీరో గా గొప్పగానే రాణించాడు. ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ కారణంగా ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీంతో కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి ‘యానిమల్’ చిత్రం లో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, బాబీ డియోల్ కి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇండియా లోనే ఆయన మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్నాడు. మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ‘డాకు మహారాజ్’, ‘హరి హర వీరమల్లు’ వంటి చిత్రాలు చేసాడు. అన్ని ఇండస్ట్రీస్ లోనూ బాబీ డియోల్ ని మేకర్స్, దర్శక నిర్మాతలు ఎంతో మర్యాదతో ట్రీట్ చేస్తారు.

కానీ బాలీవుడ్ లో మాత్రం ఆయనకు ఒక సినిమా షూటింగ్ లో ఘోరమైన అవమానం జరిగిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ‘ఆల్ఫా'(Alpha Movie) అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తోంది. ఇందులో ఆమె సూపర్ వుమెన్ క్యారెక్టర్ చేస్తుండగా, బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయం లో అలియా భట్ తన పని తాను చేసుకోకుండా దర్శకత్వం లో వేలు పెట్టిందట. ప్రతీ సన్నివేశం లో ఈమె డైరెక్టర్ కి సలహాలు ఇవ్వడం, ఆర్టిస్టులను కంట్రోల్ చేయడం వంటివి చేసిందట. అలా బాబీ డియోల్ ని కూడా మ్యానేజ్ చేసే ప్రయత్నం చేసిందట. మొదట్లో సినిమా కోసం బాబీ డియోల్ ఈమెను చాలా వరకు సహించాడు. కానీ ఒక సందర్భంలో అలియా భట్ అతి తారా స్థాయికి చేరిపోవడం తో బాబీ డియోల్ కోపం కట్టలు తెంచుకుంది అట.

దీంతో సెట్స్ లో ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగిందని, బాబీ డియోల్ కోపం సెట్స్ నుండి వెళ్లిపోయారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా కలగచేసుకొని, ఇద్దరికీ సర్ది చెప్పి సినిమా షూటింగ్ ని సజావుగా సాగేలా చూశాడని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అసలే యాష్ చోప్రా ‘వార్ 2’ , ‘మర్ధానీ 3’ సినిమాల కారణంగా భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. వీళ్ళ గొడవ కారణంగా షూటింగ్ చాలా రోజుల వరకు ఆగిపోవడం తో యాష్ చోప్రా కి ఎన్నో కోట్ల రూపాయిల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ ‘ఆల్ఫా’ చిత్రాన్ని థియేటర్స్ లో కాకుండా, ఏప్రిల్ 17 న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular