Comedy Ali Family: అలీ.. పరిచయం అక్కరలేని పెరు.. లెజెండ్రీ తెలుగు కమెడియన్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కడుపుబ్బా నవ్వించే నటుడు. ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలే ఆయన తన పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి ఘనంగా జరిపించారు. గుంటూరుకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఇటీవల అలీ కూతురు అత్తామామ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అంతా కలిసి వెకేషన్ టూర్‌ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ టూర్‌లో అలీ ఫ్యామిలీ తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని అలీ భార్య జుబేదా స్వయంగా తెలిపింది. ఈమేరకు తన యూట్యూబ్ చానెల్‌లో వీడియో కూడా పోస్ట్ చేసింది.
బంధువుల రాకతో సందడి..
ఫాతిమ అత్త, మామ గుంటూరు నుంచి వస్తున్నారని కబురు పంపడంతో అలీ భార్య జుబేదా, కూతరరు ఫాతిమ, అలీ చెల్లెలు, ఆమె కొడుకు, అలీ అమ్మ, అత్తతోపాటు అందరూ ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. మటన్ ఫ్రై, చికెన్ బిర్యాని, కీరా, పాయసం ఇలా అనేక రకాల వంటకాలు స్వయంగా చేశారు. ఇందులో అలీ కూడా ఓ చేయి వేశాడు. ఇంతలో ఫాతిమ అత్త, మామ రానే వచ్చారు. అందరూ కలిసి కమర్లు చెప్పుకున్నారు. ఫాతిమ మామ తెచ్చిన జున్ను, మిఠాయిలు తిన్నారు. సరదాగా గడిపారు. తర్వాత భోజనం చేశారు.
టూర్‌కు ప్రయాణం..
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అంతా కలిసి టూర్‌కు ప్రయాణం ప్రారంభించారు. అయితే ఈ వీడియోలో ఎక్కడికి వెళ్లారనేది సస్పెన్స్ అని జుబేదా తెలిపింది. ఈ టూర్‌కు అలీ వెళ్లలేదు. ఎయిర్ పోర్టుకు వెళ్లి ఫ్లైట్‌లో అంతా ప్రయాణమయ్యారు. విమానం టేకాఫ్ అవుతుండగా అలీ చిన్న కుమార్తె భయంతో వణికిపోయింది. అయితే ఆమె భయం పోగొట్టేందుకు అందరూ ప్రయత్నించారు. ఆటలు ఆడుతూ, స్నాక్స్ తింటూ ప్రయాణించారు.
ఇంతలో అలర్ట్…
అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో విమానంలో ఒక అలర్ట్ వచ్చింది. బయట భారీ వర్షం కురుస్తుందని, విమానం ప్రమాదంలో ఉందని దాని అర్థం. ఇంకేముంది గాల్లో ఉన్న అందరూ భయంతో వణికిపోయారు. క్షేమంగా దిగుతామా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి దేవున్ని వేడుకుంటూ కూర్చుండిపోయారు. ఈ సమయంలో విమానం కూడా కుదుపులకు లోనుకావడంతో భయం మరింత ఎక్కువైంది. అరగంట టెన్షన్ తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం దిగాక, ఎలా ఉందని అడిగితే భయంతో ఇంకోసారి విమానం ఎక్కనని చిన్నకూతురు అంది. ఫాతిమ అయితే బతికిబయట పడ్డాం అని చెప్పింది. ఆమె మామ కూడా ఎన్నోసార్లు విమానం ఎక్కానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పాడు. అలీ భార్య జుబేదా అయితే దేవుడి దయతో క్షేమంగా బయటపడ్డామని తెలిపింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలుపలేదు. మొత్తానికి అలీ కుటుంబం పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
