Akshaye Khanna: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ గ్రాసర్ గా నిల్చిన చిత్రం ‘దురంధర్'(Dhurandhar Movie). రణవీర్ సింగ్(Ranveer Singh) హీరో గా నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి ‘పుష్ప 2’ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేందుకు సిద్ధంగా ఉంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 730 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. నాల్గవ వీకెండ్ లో అయితే అక్షరాలా ఈ చిత్రానికి 62 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం 218 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తే, రెండవ వారం లో 261 కోట్ల రూపాయలు, మూడవ వారం లో 189 కోట్ల రూపాయిలు , నాల్గవ వారం లో 160 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. చూస్తుంటే ఇప్పట్లో ఈ వసూళ్ల సునామీ ఆగేలా లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ హీరో రణవీర్ సింగ్ కి ఎంత దక్కుతుందో , విలన్ గా చేసిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) కి కూడా అంతే క్రెడిట్ దక్కుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలో ఆయన డామినేషన్ ప్రధానంగా నడిచింది. ఆయన నటన,స్వాగ్, స్టైల్, డ్యాన్స్ అన్నీ కూడా టాప్ క్లాస్ లెవెల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన కారు దిగి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి డ్యాన్స్ వేసే వీడియో సోషల్ మీడియా లో వేరే లెవెల్ లో వైరల్ అయ్యింది. ఎవరు ఈ స్టెప్పుని ఇంత సహజంగా కంపోజ్ చేసారు?, ఈ రేంజ్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేయగల సత్తా ఎవరికీ ఉంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాగా ఆరాలు తీశారు. అయితే వాళ్లకు తెలిసింది ఏమిటంటే ఈ పాటకు కొరియోగ్రాఫర్ ఎవ్వరూ లేరట.
అక్షయ్ ఖన్నా నే సొంతంగా కంపోజ్ చేసుకున్న స్టెప్స్ అట అవి. ఆయనలో ఇంత నేచురల్ టాలెంట్ కూడా ఉందా అని ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ముందు వరకు కూడా అక్షయ్ ఖన్నా రేంజ్ రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే. కానీ ఈ సినిమా హిట్ అయ్యాక ఆయన తన రెమ్యూనరేషన్ ని ఏకంగా పాతిక కోట్ల రూపాయలకు పెంచినట్టు తెలుస్తోంది. నిర్మాతలు కూడా ఆయన కోరినంత డబ్బులు ఇవ్వడానికి రెడీ గా ఉన్నారట. ఒకే ఒక్క సినిమాతో కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రేంజ్ స్టార్ స్టేటస్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అక్షయ్ ఖన్నా కి ఇప్పుడు జరిగింది. ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.