Akshaye Khanna: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. కారణం ఏంటి అంటే నటులుగా ముందుకు దూసుకెళ్లాలనే ఆసక్తితో ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు స్టార్ యాక్టర్స్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో నటుడు అక్షయ్ కన్నా చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. వందల, వేల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ఆ సినిమాలన్నీ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’ సినిమాలో తను విలన్ గా నటించాడు. ఈ సినిమా సక్సెస్ లో తను కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. తను చేసిన ఆ పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయింది. ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించి మాట్లాడుతున్నారు…
ఈ సినిమా కంటే ముందే ఆయన చావా సినిమాతో నటుడిగా రాణించాడు. ఈ సినిమాలో తనలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీశాడు. దాంతో ఈ సినిమా సైతం 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం… దాని కంటే ముందు ‘దృశ్యం 2’ సినిమాలో నటించి ప్రేక్షకులందరి అటెన్షన్ ని క్రియేట్ చేశాడు…
ఏది ఏమైనా కూడా అక్షయ్ కన్నా లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు అతన్ని ఇండియాలోనే గొప్ప నటుడిగా ఎలివేట్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న మాకాళీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఎప్పుడో కమిట్ అయ్యాడు కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో ఆయన చాలా తక్కువ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
కానీ ‘దురంధర్’ సినిమా సక్సెస్ అయిన తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచాడు. ఇప్పుడు కనుక తెలుగు సినిమాకి కమిటైతే మాత్రం ఆయన చాలా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. మొత్తానికైతే ఆయన మాకాళీ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు…