Sky Force : ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో అక్కడి హీరోల కంటే మన సౌత్ హీరోల డామినేషన్ ఎక్కువ అయ్యింది. షారుఖ్ ఖాన్ ఒక్కడు వరుసగా మూడు హిట్లు కొట్టి బాలీవుడ్ కి ఊపిరి పోశాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత షారుఖ్ ఖాన్ కాకుండా కేవలం రణబీర్ కపూర్ మాత్రమే ‘ఎనిమల్’ చిత్రం తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక మిగిలిన హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హ్రితిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ఇలా బాలీవుడ్ స్టార్స్ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నారు. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3 ‘ మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ వసూళ్లు రాలేని పరిస్థితి. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ మూవీ స్త్రీ 2 తప్ప బాలీవుడ్ నుండి మరో సూపర్ హిట్ చిత్రం లేదు. ప్రస్తుతం ఆల్ టైం టాప్ 5 గ్రాస్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి.
ఇలాంటి సౌత్ ఇండియన్ హీరోల డామినేషన్ సమయంలో, అక్షయ్ కుమార్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్కై ఫోర్స్’ చిత్రం కాస్త ఉపశమనం కలిగించింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ టాక్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు భారీగా వచ్చాయి. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 11 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ కి వచ్చిన బెస్ట్ ఓపెనింగ్ ఇది. ఆయన గత చిత్రాలకు 10 కోట్ల రూపాయిల కంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు అయితే అద్భుతమైన ఆక్యుపెన్సీలతో ఈ సినిమా ప్రారంభమైంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
మార్నింగ్ షోస్ కే ఈ రేంజ్ ట్రెండ్ ఉంటే సాయంత్రం మరియు సెకండ్ షోస్ కి గంటకు 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. ఊపు చూస్తుంటే రెండవ రోజు ఈ చిత్రానికి మొదటి రోజుకంటే రెండింతల ఎక్కువ వసూళ్లు, అనగా 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక రేపు రిపబ్లిక్ డే సందర్భంగా నేషనల్ హాలిడే అవ్వడంతో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిలకు పైగా నెట్ వసూళ్లు రావొచ్చు. అలా మూడు రోజుల్లో ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రాబోతున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అక్షయ్ కుమార్ కి, ఆయన అభిమానులకు ఈ సినిమా పెద్ద బూస్ట్ ఇచ్చింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.