Homeఎంటర్టైన్మెంట్Akshay Kumar: ఆ పాట పాడినందుకు జనాలు నన్ను రోడ్డు మీద చావగొట్టారు - అక్షయ్...

Akshay Kumar: ఆ పాట పాడినందుకు జనాలు నన్ను రోడ్డు మీద చావగొట్టారు – అక్షయ్ కుమార్

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్(Akshay Kumar) గురించి మన టాలీవుడ్ ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే తెలుసు. కానీ ఆయన బాలీవుడ్ లో మన మాస్ మహారాజ రవితేజ లాంటి హీరో. భారీ యాక్షన్ సినిమాలను తీయగలడు , డే సమయంలో పొట్టచెక్కలు అయ్యే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను కూడా తీయగలడు. ఇక ఆయన చేసే రిస్కీ స్తంట్స్ ఇండియా లో ఏ హీరో కూడా చెయ్యలేడు . హాలీవుడ్ లో టామ్ క్రూజ్ ఎలాంటి రిస్కీ స్తంట్స్ చేసేవాడో , అక్షయ్ కుమార్ కూడా అలాంటి స్తంట్స్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇలా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా ఉంటాడు అక్షయ్ కుమార్. ఈమధ్య కాలంలో ఆయనకీ భారీ విజయాలు దక్కడం లేదు , భారీ కం బ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన బాలీవుడ్ లో ‘ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ లో పాల్గొన్నాడు. ఈ షోలో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తనని జనాలు ఒకప్పుడు నడిరోడ్డు మీద చితకబాదిన సంఘటన కూడా ఒకటి గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను కాలేజీ లో చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని చూసి బాగా ఇష్టపడ్డాను . ఆమెని ఆకర్షించడానికి నేను ప్రత్యేకంగా ఆమె కోసం ఒక పాట నేచుకున్నాను. నా స్నేహితుడు ఒకరికి గిటార్ వాయించడం బాగా వచ్చు. వాడిని నాతో పాటు తీసుకెళ్లి ఆ అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. వాడు గిటార్ వాయిస్తుంటే , నేను పాట పాడాను. నా పాట విని కచ్చితంగా ఆ అమ్మాయి బయటకు వస్తుందని అనుకుంటే , ఆమె ఇంటి చుట్టుపక్కన వాళ్ళు వచ్చారు. మమల్ని చితక్కొట్టారు. వాళ్ళ చేతిలో దెబ్బలు చావు దెబ్బలు లాగా అనిపించాయి , చచ్చామనుకున్నాం. అలా ఒక అమ్మాయిని అట్ట్రాక్ట్ చేయడం కోసం వెళ్లి తన్నులు తిని వచ్చాము’ అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్.

జనాలు చితకొట్టే రేంజ్ లో వీళ్ళు ఏ పాట పాడి ఉంటారు? , అంత ఘోరమైన గాత్రంతో పాడారా ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఈయన హీరో గా నటించిన సినిమాలు 5 విడుదల అయ్యాయి. అందులో మన టాలీవుడ్ చిత్రం ‘కన్నప్ప’ కూడా ఉంది . ఇందులో ఆయన శివుడి పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ‘భూత్ బంగ్లా ‘, ‘వెల్కమ్ టు ది జంగిల్’ ‘హైవ్వాన్’ వంటి చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ పూర్తి అయ్యాయి. త్వరలోనే ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version