Homeఆంధ్రప్రదేశ్‌Adulterated Milk In Andhra Pradesh: తెల్లటి పాల వెనుక నమ్మలేని నిజాలు.. తెలుసుకోండిలా

Adulterated Milk In Andhra Pradesh: తెల్లటి పాల వెనుక నమ్మలేని నిజాలు.. తెలుసుకోండిలా

Adulterated Milk In Andhra Pradesh: ఏపీలో( Andhra Pradesh) కల్తీ పాల ఘటన కలకలం సృష్టించింది. ఇప్పటికే ఈ పాలు తాగిన నలుగురు మృతి చెందారు. మరో 12 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. బాధిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వైద్య పరీక్షల నివేదిక కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. కేవలం పాల ద్వారా ఇంతటి ప్రమాదం జరగడం అంతటా చర్చనీయాంశం అయ్యింది. పాల వ్యాపారంలో కూడా విషయం నింపడం పై విస్మయం వ్యక్తం అవుతుంది. ప్రతి చోటా పాలు క్షేమమా లేదా అనే చర్చ నడుస్తోంది. ప్రమాదకరమైన రసాయనాలు కలపడం ద్వారా ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారని తెలియడం ఆందోళన కలిగిస్తోంది.

* అంతటా చర్చ.. రాజమండ్రి( Rajahmundry) కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ. వ్యాపారంలో లాభాల కోసం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసి ఇటువంటి ఘటనలకు పాల్పడుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే డైరీలకు సరఫరా చేసే పాలల్లో సైతం ఇదేవిధంగా కల్తీ జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే డైరీలకు సాంకేతిక నిపుణులు ఉంటారు. ఎప్పటికప్పుడు పరిశీలన ద్వారా సరైన పాలు అని తేలితేనే వాటిని ఉత్పత్తులుగా మార్చుతారు. అయితే తాజా ఘటనతో డైరీలకు సరఫరా అయ్యే పాలపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* కల్తీ టెక్నాలజీ..
అయితే ఏ వస్తువునైనా కల్తీ చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు పాలలో సైతం అదే మాదిరిగా కల్తీని ప్రవేశ పెడుతున్నారు. పాలను నురగ వచ్చేలా చేసేందుకు యూరియా( urea ), డిటర్జెంట్స్ లిక్విడ్ సోపులను వాడుతున్నట్లు చెబుతున్నారు. ఇది కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో కిడ్నీ పూర్తిగా పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. రాజమండ్రి ఘటనలో ముందుగా అస్వస్థతకు గురయ్యారు. గంటల వ్యవధిలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ బాధితులకు సంబంధించి మూత్రం నిలిచిపోవడం గమనిస్తే మాత్రం పాలలో యూరియా మిశ్రమాన్ని కలిపారని స్పష్టమవుతోంది. మరోవైపు పాలు విరిగిపోకుండా కొందరు ఫార్మలిన్ కలుపుతుంటారు. ఇది శవాలను కూలిపోకుండా ఉంచేందుకు వాడే రసాయనం. ఇది శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

* ఇలా గుర్తించండి..
అయితే పాలు కల్తీ అనేది ఎప్పటినుంచో వెలుగు చూస్తూనే ఉంది. పాలు కల్తీ వల్ల 87% మంది క్యాన్సర్ బారిన పడ్డట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organisation) 2018 లోనే గుర్తించింది. సింథటిక్ మిల్క్ కూడా తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాలు పాడవకుండా యూరియా, కాస్టిక్ సోడా, శుద్ధి చేసిన నూనె కలిపి పాలు తయారు చేస్తుంటారు అని చెబుతున్నారు నిపుణులు. ఇవి విశ్వంతో సమానమని హెచ్చరిస్తున్నారు. అయితే పాల కల్తీ ని గుర్తించవచ్చని చెబుతున్నారు. ఇంట్లో గచ్చు పై ఒక చుక్క పాలను వేయడం ద్వారా పాలు స్వచ్ఛమైన వా కాదా అని తేలికగా తెలుసుకోవచ్చు అని అంటున్నారు. స్వచ్ఛమైన పాలు అయితే అవి నెమ్మదిగా కదులుతూ వెనుక ఒక తెల్లటి గీతగా ఉంటుందని.. కల్తివి అయితే మాత్రం ఎటువంటి గీత లేకుండా వేగంగా కిందకు జారిపోతాయని సూచిస్తున్నారు. పాలను బాగా షేక్ చేస్తే నురగ వస్తుంది. ఆ నురగ ఎంతకీ తగ్గకపోతే డిటర్జెంట్ లేదా సోప్ కలిపినట్టు అర్థం చేసుకోవచ్చు. పాలలో యూరియాను కలపడం గురించి కూడా తెలుసుకోవచ్చు. ఒక స్పూన్ పాలను తీసుకుని అందులో అర స్పూన్ సోయాబీన్ పొడి లేదా కందిపప్పు పొడి వేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తే పాలలో యూరియా ఉందా లేదా తెలిసిపోతుంది. చివరకు సింథటిక్ పాలను కూడా ఇంట్లో తేలిగ్గా గుర్తించవచ్చు.. పాలను అరచేతిలో రుద్దడం ద్వారా.. పోపు తగిలినట్లు జిగటగా అనిపిస్తుంది. దానిని సింథటిక్ పాలుగా గుర్తించవచ్చు కూడా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version