Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. అందుకే ‘అఖండ’ క్రేజ్ బాలీవుడ్ కు కూడా పాకింది. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ పోటీ పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి ఇటు అక్షయ్ కుమార్ కి అటు అజయ్ దేవగణ్ కి ఇద్దరికీ అఖండ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది.

పైగా అఖండ క్యారెక్టర్ కు ఇటు అక్షయ్ కుమార్ అటు అజయ్ దేవగణ్ ఇద్దరు హీరోల్లో ఎవరైనా సరే న్యాయం చేయగలుగుతారు. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ ఇద్దరిలో ఒకరు అఖండ రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఇక తెలుగులో అఖండ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడిచింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకుని తన రేంజ్ ఏమిటో చూపించాడు.
Also Read: రేపే ‘కొండా’ ట్రైలర్.. బాగుంటేనే గిట్టుబాటు !

వాస్తవానికి అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఎవ్వరూ నమ్మలేదు. ఆ మాటకొస్తే.. ఈ సినిమా నిర్మాత కూడా ఈ స్థాయి హిట్ ను ఊహించలేదు. కారణం, బాలయ్య గత చిత్రాలు జైసింహా, రూలర్, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా వరుసగా అన్నీ సినిమాలలో ఏది పది కోట్లుకు మించి కలెక్ట్ చేయలేదు. అందుకే దిల్ రాజు ఈ సినిమా నైజాం రైట్స్ ను చాలా తక్కువ ధరకే కొన్నాడు. కట్ చేస్తే.. నిర్మాత కంటే కూడా దిల్ రాజుకే ఎక్కువ లాభాలు వచ్చాయి.
Also Read: ఇంట్లో కూర్చుని నెలకు రూ.60 వేలు సంపాదించవచ్చు.. ఎలా అంటే?