Samantha: పర్సనల్ లైఫ్ లిటిగేషన్ లోకి వెళ్లిపోయాక ప్రొఫెషనల్ లైఫ్ పై లిమిట్స్ ను క్రాస్ చేసుకుంటూ పోతుంది సామ్. ఎప్పుడైతే విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిందో… ఇక అప్పటి నుంచి దర్శకులందరికీ టచ్ లోకి వెళ్లి అవకాశాలు ఇవ్వండి, సినిమాలు చేస్తాను అంటూ మొహమాటం లేకుండా అడుగుతుంది. ఈ క్రమంలోనే సమంత దర్శకురాలు నందిని రెడ్డితో ఓ సినిమా చేయడానికి కమిట్ అయింది.

అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. కానీ, సమంత మెయిన్ టార్గెట్ మాత్రం హిందీ సినిమాలే. అందుకే కొన్నాళ్ళు పాటు ముంబైలోనే మకాం పెట్టి.. హిందీ సినిమాల పరంగా కూడా జోరు పెంచడానికి కసరత్తులు చేస్తోంది. మొత్తానికి బాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున సినిమాలు చేయాలని సామ్ ఆశ పడుతుంది. పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవడమే తన ప్రస్తుత గోల్ అని సన్నిహితుల దగ్గర కూడా చెబుతుందట.
విడాకుల తర్వాత మానసికంగా సమంత కొంతవరకు బాగా ఫీల్ అయింది. ఆ బాధను మర్చిపోవడానికి నటిగా బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే నిర్మాతనూ మారాలని ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లను నిర్మించాలనే ఉద్దేశ్యంతో సామ్ ముందుకు పోతుంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో సామ్ ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ నిర్మాణానికి సిద్ధం అయింది.

ఈ సిరీస్ లో హిందీ ప్రముఖ నటులు నటిస్తారట. మరి ఆ నటులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్టు సామ్ నిర్మాణంలోనే కాకుండా నటిగా కూడా ఇప్పటికే రెండు హిందీ సినిమాలకు కమిట్ అయ్యిందని టాక్ ఉంది. పైగా ఆ రెండు సినిమాలు భారీ ఎత్తున తెరకెక్కబోతున్నాయని.. ఆ సినిమాల్లో స్టార్ హీరోలు నటించబోతున్నారని తెలుస్తోంది.

వచ్చే ఏడాదిలోనే ఆ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హిందీ సినిమాల్లో ఎక్స్ పోజింగ్ పరంగా పరిధి దాటాల్సి ఉంటుంది. సమంత అందుకు కూడా అంగీకారం తెలిపిందట. ఏది ఏమైనా సమంతకు మాత్రం ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
