https://oktelugu.com/

Bangarraju Movie: వచ్చేస్తున్న నవ మన్మధుడు… బంగార్రాజు మూవీ నుంచి చైతూ కి బర్త్ డే గిఫ్ట్

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం “బంగార్రాజు”. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబోలో గతంలో వచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ప్రక్షాకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. పైగా ఈ మూవీలో అక్కినేని హీరోలైన నాగ్ […]

Written By: , Updated On : November 23, 2021 / 11:31 AM IST
Follow us on

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం “బంగార్రాజు”. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబోలో గతంలో వచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ప్రక్షాకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. పైగా ఈ మూవీలో అక్కినేని హీరోలైన నాగ్ – చైతూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈరోజు నాగ చైతన్య పుట్టిన రోజు సంధర్భంగా మూవీ టీమ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

akkineni naga chaitanya teaser released from bangarraju movie

Also Read: Naga Chaitanya: చైతుతో ‘శివ’ ట్రై చేసిన నాగ్.. ప్చ్ వర్కౌట్ కాలేదు !

తాజాగా బంగార్రాజు సినిమా నుంచి నాగ చైతన్య టీజర్ ను విడుదల చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లో నాగచైతన్య మాస్ లుక్ లో కనిపించారు. చేతిలో కర్ర పట్టుకొని బుల్లెట్ బండి పై వచ్చేందుకు రెడీ అవుతూ నాగచైతన్య అందరినీ అలరించాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా… నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది.  ఈ సంధర్భంగా టీజర్ రిలీజ్ చేయడంపై అక్కినేని నాగార్జునకు చైతన్య థాంక్స్ నాన్న అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

https://twitter.com/AnnapurnaStdios/status/1463013428377706502?s=20

Also Read: Anil Ravipudi: దర్శకుడిగా ఇది నాకు ఆరో పుట్టినరోజు- అనిల్​ రావిపుడి