Akkineni Nagachaitanya
Akkineni Nagachaitanya : అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ వచ్చే నెల 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా వదులుతూ ఉన్నారు. ముందుగా పాటలను విడుదల చేసారు. ఒక్కో పాట సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. రీసెంట్ గా విడుదల చేసిన ‘హైలెస్సో’ పాట కూడా పేలింది. దీంతో యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రంపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న వైజాగ్ లోని శ్రీరామ థియేటర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య తో పాటు మూవీ టీం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్యనే శోభిత దూళిపాళ్ల ని పెళ్లి చేసుకున్నాను. ఈమె కేవలం అచ్చ తెలుగు అమ్మాయి మాత్రమే కాదు, మీ వైజాగ్ అమ్మాయి కూడా. మా ఇంట్లో ప్రస్తుతం రూలింగ్ పార్టీ వైజాగ్. అలాంటి వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే నా పరువు పోతుంది. దయచేసి నా పరువు కాపాడండి’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ‘ప్రతీ ఒక్కరి జీవితం లో ఒక తండేల్ (నాయకుడు) ఉంటాడు. నాకు నిజ జీవితం లో తండేల్ ఎవరో మీ అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా వరకు మాత్రం నా తండేల్ అల్లు అరవింద్ గారే. ఆయనతో పని చేసిన అనుభూతి జీవితంలో మర్చిపోలేను. మాకు ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. సాయి పల్లవి తో ఇది నా రెండవ సినిమా. లవ్ స్టోరీ కంటే ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు .
ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 80 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించాడు. మేకింగ్ క్వాలిటీ విషయం లో ఆయన ఎక్కడ రాజీపడలేదని ట్రైలర్ ని చూస్తుంటే అర్థమవుతుంది. దేశభక్తిని అంతర్లీనంగా చూపిస్తూ తెరకెక్కించిన ఈ ప్రేమ కథ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చరిత్ర సృష్టించబోతుందని మేకర్స్ బలమైన నమ్మకం తో చెప్తున్నారు. మరి ఇదే రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి కూడా వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు ఆగాల్సిందే. ఈ సినిమా కేవలం నాగ చైతన్య కి మాత్రమే కాదు. అక్కినేని కుటుంబం మొత్తానికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే గత కొంత కాలం ఈ కుటుంబ హీరోల నుండి వచ్చిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. తండేల్ చిత్రం మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు.