Vijayawada
Vijayawada: మన దాయాది రాష్ట్రం పాకిస్తాన్( Pakistan) అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. మనసులో మరో రకమైన భావన ఉంటుంది. పాకిస్తాన్ తో క్రీడలు అన్న ప్రత్యర్థికి మించి శత్రువు అన్న భావన లో చూస్తాం. అంతలా మన మనసులో జరగని ముద్ర పడింది పాకిస్తాన్ పై. అటువంటి పాకిస్తాన్ పేరుతో ఏపీలో ఒక కాలనీ ఉందని తెలుసా? మీరు వింటున్నది నిజమే. విజయవాడలో పాకిస్తాన్ కాలనీ పేరుతో ఓ ప్రాంతమే ఉంది. ఎప్పటినుంచో ఆ పేరు కొనసాగుతోంది. అయితే కాస్త భిన్నంగా ఉండడంతో తమ కాలనీ పేరు మార్చాలని ఎప్పటినుంచో కాలనీవాసులు కోరుతూ వచ్చారు. ఎన్నో సందర్భాల్లో విన్నవించారు కూడా. అయితే ఎట్టకేలకు వారు అనుకున్నది సాధించారు. ఆ కాలనీ పేరును మార్చేశారు. కొత్తగా మరో పేరును పెట్టారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* ఎప్పటి నుంచో పేరు మార్చాలని డిమాండ్ విజయవాడ( Vijayawada) కార్పొరేషన్ పరిధిలో 62వ డివిజన్ పరిధిలో పాకిస్తాన్ కాలనీ ఉంది. తాజాగా కాలనీ పేరు మారుస్తూ గెజిట్ ఇచ్చారు అధికారులు. భగీరథ కాలనీగా పేరు మార్చారు. కొత్త పేరుతో ఈ ప్రాంతంలో నివాసం ఉండే దాదాపు 60 మందికి ఆధార్ కార్డులో చిరునామాను కూడా మార్చినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గతంలో ఈ కాలనీ పేరు మార్చాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులతో పాటుగా రాష్ట్ర సగర్ రాజపుత్ సేవా సమితి సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున కలెక్టర్ కు విన్నవించారు కూడా. అందుకే ఈ లేఖలను పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ కాలనీ పేరును భగీరథ కాలనీగా మార్చినట్లు తెలిపారు కలెక్టర్.
* ఆధార్ లో చిరునామాలు మార్పు
ఏపీ మున్సిపల్ కార్పొరేషన్( AP municipal corporation) చట్టంలోని సెక్షన్ 418 ప్రకారం ఈ మార్పు చేసి.. నగరపాలక కౌన్సిల్ ముందు ఉంచగా.. పాలకవర్గం ఆమోదించింది. దీంతో ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్. అటు తరువాత కాలనీలో నివాసం ఉంటున్న ప్రజల ఆధార్ కార్డులో చిరునామా మార్చేందుకు మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో 270 మంది ఉండగా.. ఇప్పటికే 60 మంది చిరునామాలు మార్చినట్లు కలెక్టర్ వివరించారు.
* ఆ కాలనీకి పేరు ఎలా వచ్చిందంటే
అయితే పాకిస్తాన్( Pakistan) కాలనీ పేరు అనేది ఎలా వచ్చిందంటే.. దాని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. అటు తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులు అయ్యాయి. అప్పట్లో కొన్ని కుటుంబాలకు అప్పటి మన దేశ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించింది. అలా పాయకాపురం ప్రాంతంలో 40 కుటుంబాలతో కొత్తగా ఈ కాలనీ ఏర్పాటు అయింది. 1984 4 ఇళ్లు, మూడు రోడ్లతో నిర్మించిన ఈ కాలనీకి పాకిస్తాన్ కాలనీ గా పేరు పెట్టారని ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ అనే పేరును తొలగించి.. భగీరథ అని చేర్చి.. కొత్తగా కాలనీ పేరును మార్చేశారు.