https://oktelugu.com/

Akkineni Heroes: మరో మల్టీస్టారర్ ప్లాన్ లో అక్కినేని హీరోలు !

Akkineni Heroes :  అక్కినేని హీరోలు మల్టీస్టారర్ కు జై కొడుతున్నారు. మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలసి నటించిన నాగార్జున..ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీని చిరుతో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట. అయితే అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ,  నాగార్జున ది ఘోస్ట్ మూవీలోనూ నటిస్తున్నాడు.  ఆ సినిమాల తర్వాత మల్టీ స్టారర్స్ లిస్ట్ పెరుగుతుందన్న మాట. అఖిల్ […]

Written By: , Updated On : February 27, 2022 / 05:50 PM IST
Akhil Akkineni

Akhil Akkineni

Follow us on

Akkineni Heroes :  అక్కినేని హీరోలు మల్టీస్టారర్ కు జై కొడుతున్నారు. మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలసి నటించిన నాగార్జున..ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీని చిరుతో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట. అయితే అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ,  నాగార్జున ది ఘోస్ట్ మూవీలోనూ నటిస్తున్నాడు. 

Akkineni Family

Akkineni Family

ఆ సినిమాల తర్వాత మల్టీ స్టారర్స్ లిస్ట్ పెరుగుతుందన్న మాట. అఖిల్ కి ఎలాగైనా ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని గత కోనేళ్ళుగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి  అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా  ఇంకా సాలిడ్  హిట్  మాత్రం అందుకోలేకపోయాడు.  గుడ్డిలో మెల్ల లాగా  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో  ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. 

Akhil Akkineni

Akhil Akkineni

కానీ ఆ సినిమాకు కూడా  థియేటర్స్ నుంచి  ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.  దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి  మొత్తానికి  తన  కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ  క్రమంలోనే నాగార్జున.. అఖిల్ కోసం ఈ మల్టీస్టారర్ ను ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో అఖిల్ నే మెయిన్ అట. 

 

అంటే.. పేరుకి మల్టీస్టారర్ అయినా.. అఖిల్ హీరోగా హైప్ చేసి వదులుతారు. మరి నాగార్జున ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.        ప్రస్తుతానికి అయితే, నాగార్జున  అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు.   ముఖ్యంగా అఖిల్  లుక్  పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  ఏది ఏమైనా అఖిల్ హిట్ కోసం పడిగాపులు కాయడం విచిత్రం.  

Akhil Akkineni

Akhil Akkineni