Shobitha Cooking Skills: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) సతీమణి శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) నిత్యం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు మరియు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు మరియు వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంసంగా మారింది. వీటిల్లో ఆమె అంట్లు తోముతూ కనిపించింది. ఇక వీడియో లో అయితే వంట చేస్తూ కనిపించింది. ఇదంతా ప్రస్తుతం ఆమె తాను చేస్తున్న సినిమా షూటింగ్ లోనే చేసిందట. ఇవి చూసిన అభిమానులు ఆశ్చర్యపోతూ ఇంత బిజీ గా ఉండే శోభిత, ఇలాంటి పనులు కూడా చేస్తుందా?, సింప్లిసిటీ అంటే ఇదే. ఎంతైనా తెలుగమ్మాయి అంటే తెలుగమ్మాయే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక అభిమాని పెట్టిన రిప్లై కి ఆమె ఆసక్తి కరమైన సమాధానం కూడా ఇచ్చింది.
‘అక్కా..మీకు వంట చేసే టాలెంట్ కూడా ఉందా?’ అని ఒకరు అడగ్గా, దానికి శోభిత సమాధానం చెప్తూ ‘మూడ్ బాగున్నప్పుడు చేస్తాను చెల్లి’ అని అంటుంది. ఇదే పోస్టు క్రింద శోభిత భర్త నాగ చైతన్య కూడా కామెంట్ చేసాడు. ‘శోభిత చేసిన వంటలను రుచి చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ తన స్టోరీ లో పెట్టాడు నాగ చైతన్య. అలా ఈ సరదా సంభాషణ జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోయంగా గడుపుతుంది. పెళ్ళికి ముందు నాగ చైతన్య కెరీర్ పరంగా అనేక ఒడిదుడుగులను ఎదురుకున్నాడు. వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. కానీ పెళ్లి తర్వాత ఆయన నుండి విడుదలైన ‘తండేల్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మరోపక్క శోభిత మామయ్య అక్కినేని నాగార్జున కూడా కుబేర,కూలీ చిత్రాలతో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు.
ఇక పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరం అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ చిత్రం లో నటిస్తుంది. మరోపక్క నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో కలిసి ఒక మిస్టిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని, నాగ చైతన్య కి మంచి పేరు తెచ్చిపెడుతుందని అక్కినేని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.