మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూనే అంగీకరించిన సినిమా మలయాళ రీమేక్ “లూసిఫర్” సినిమా. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా సరైన డైరెక్టర్ సెట్ కాక, పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. అక్కినేని నాగార్జున సతీమణి అమల ఈ సినిమాలో మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని ఆ టాక్ సారాంశం.
నిజానికి ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అక్కినేని అమల ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. అందుకే, మేకర్స్ కూడా ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా ఈ వార్త బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఎందుకంటే ‘లూసిఫర్’లో చెల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పైగా మలయాళం వెర్షన్ లో అక్కడి స్టార్ హీరోయిన్ మంజు వార్యర్ ఈ పాత్రలో నటించింది.
తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషాన్ని పెంచుకుని.. అతన్ని దారుణంగా అవమానించి చివరికి అతని సాయమే కోరే ఆ ఎమోషనల్ రోల్ లో అక్కినేని అమల నటిస్తే కచ్చితంగా సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. ఎలాగూ ఈ మధ్య అమల మళ్ళీ నటన పై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. కాబట్టి, ఈ అవకాశం వస్తే.. అక్కినేని అమల వదులుకోరు.
మరి లూసిఫర్ టీం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ మధ్య సుహాసిని కూడా ఈ రోల్ కు ఫిక్స్ అయిందని అన్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై అడ్డు అదుపు లేకుండా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక తమిళ దర్శకుడు మోహన్ రాజాకి ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం రావడం కూడా కొన్ని నాటకీయ పరిణామాల మధ్యే చోటు చేసుకుంది. మోహన్ రాజా తమిళంలో “జయం” వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశాడు. మరి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.