Homeఎంటర్టైన్మెంట్Akkineni Akhil: 'ఇలాంటి మహిళ సమాజం లో బ్రతికేందుకు అనర్హులు' అంటూ మంత్రి కొండా సురేఖ...

Akkineni Akhil: ‘ఇలాంటి మహిళ సమాజం లో బ్రతికేందుకు అనర్హులు’ అంటూ మంత్రి కొండా సురేఖ పై అక్కినేని అఖిల్ సంచలన కామెంట్స్!

Akkineni Akhil: కొండా సురేఖ ఇటీవల అక్కినేని కుటుంబం పై, సమంత పై చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మంత్రి స్థాయిని మర్చిపోయి, ప్రత్యర్థిపై రాజకీయ విమర్శలలో లీనమై అసలు ఆమె ఒక మహిళ అనే విషయమే మర్చిపోయింది. అందుకే తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఉండే నటీనటులు ప్రభుత్వం లో పని చేసే ముఖ్యమంత్రి పైన కానీ, మంత్రుల పైన కానీ ఎలాంటి కామెంట్స్ చేయరు. ఎందుకంటే పరిశ్రమకి రావాల్సిన లాభాలు ఆగిపోతాయి అనే భయం ఉంటుంది. గడిచిన ఐదేళ్ళలో సీఎం జగన్ పాలనలో మన సినీ పరిశ్రమ అలాంటి ఇబ్బందులనే ఎదురుకుంది.

ప్రభుత్వాన్ని ఎదిరిస్తే నష్టం జరుగుతుంది అనే భయం ఉన్నప్పటికీ కూడా నిర్మొహమాటంగా కొండా సురేఖ పేరుని ప్రస్తావిస్తూ ఈ స్థాయిలో తిరగబడ్డారంటే, ఆమె వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిపై అక్కినేని ఫ్యామిలీ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. నాగార్జున నిన్న నాంపల్లి హిట్ కోర్టు లో కొండా సురేఖ పై పరువు నష్టం దావా కూడా వేసాడు, ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేసాడు. ఇక కాసేపటి క్రితమే నాగార్జున రెండవ తనయుడు అక్కినేని అఖిల్ కూడా చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన స్పందించిన తీరుని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే.

ఆయన మాట్లాడుతూ ‘కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు చాలా అసభ్యకరంగా,జుగుప్సాకరంగా ఉన్నాయి. బాధ్యత గల పదవి కూర్చున్న ఆమె సామజిక విలువలు, సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ఆమె ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది, ఇది క్షమించరాని నేరం కూడా. ఇన్ని రోజు ఎంతో గౌరవంగా బ్రతికిన నా కుటుంబ సభ్యులు, ఈమె చేసిన నీచమైన ఆరోపణల కారణంగా అగౌరవ పడ్డారు. ఆమె రాజకీయ లబ్ది కోసం , ఆమె కంటే ఎంతో ఉన్నతమైన విలువలను పాటిస్తున్న అమాయకపు వ్యక్తులను సిగ్గు లేకుండా బలిపశువులను చేసింది. ఈ విషయం ఇక్కడితో నేను వదలను. ఒక కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడిగా నేను మౌనం గా ఉండను. ఈ సిగ్గుమాలిన మహిళకు తగిన స్థాయిలో బుద్ధి చెప్పాలి. మన సమాజం లో ఇలాంటోళ్ళు ఉండేందుకు ఏ మాత్రం అర్హత లేదు’ అంటూ అక్కినేని అఖిల్ చాలా తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు. అక్కినేని కుటుంబం లో అమల తర్వాత అదే స్థాయి ఫైర్ తో మాట్లాడింది అఖిల్ మాత్రమే. ఆయనలో ఇంత కోపం ఉంటుందా అనేది ఈ ట్వీట్ ని చూసినప్పుడే అభిమానులకు కూడా అర్థమైంది. ఒక మంత్రి స్థాయి వ్యక్తికి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా, ఏకంగా ఇలాంటి వ్యక్తులు సమాజం లో ఉండడకూడదు అంటూ మాట్లాడాడు అంటే అఖిల్ ఆమె మాటలకు ఎంత బాదపడ్డాడో తెలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular