https://oktelugu.com/

Akira Nandan : అకీరా ఆరున్నర అడుగుల కట్ అవుట్ చూశారా.. పవన్ వారసుడు వచ్చేస్తున్నాడు!

ఈ విషయాన్ని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక అకీరా ఎంట్రీ ఎప్పుడని... రేణు దేశాయ్ ని పలు సందర్భాల్లో మీడియా అడగడం జరిగింది. అది తన ఆసక్తి మీద ఆధారపడి ఉంటుందని అకీరా అన్నారు.

Written By: NARESH, Updated On : February 24, 2024 7:15 pm
Follow us on

Akira Nandan : పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ మరొక హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన్ని డెమీ గాడ్ గా పూజిస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఎన్నికల అనంతరం తిరిగి హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయనున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు. కాగా పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. అకీరా ప్రస్తుత వయసు 20 ఏళ్ళు. అంటే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అని చెప్పొచ్చు.

తండ్రి వలె మల్టీ టాలెంటెడ్. ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. అకీరా మెగా హీరోలందరితో ఎత్తు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ పొడుగైన మెగా హీరోగా ఉన్నాడు. అకీరా హైట్ ఇప్పటికే ఆరున్నర అడుగులు దాటేసింది. లుక్ లో నాన్నకు ఏమాత్రం తక్కువ కాదు. చక్కని హెయిర్ స్టైల్. గడ్డంతో కట్టిపడేసే గ్లామర్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య మెగా ఫ్యామిలీ బెంగుళూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

మెగా హీరోల సంక్రాంతి వేడుకల్లో అకీరా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. తాజాగా అకీరా తల్లి రేణు దేశాయ్ ఓ ఆసక్తికర వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. రెడ్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటు ధరించి అకీరా సో స్టైలిష్ గా ఉన్నాడు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నాడు. అకీరా బ్లూ టూత్ ఇయర్ బడ్స్ వాడకుండా… వైర్ తో కూడిన హెడ్ సెట్ వాడుతున్నాడట. బ్లూటూత్ ఇయర్ బడ్స్ వలన చెవులు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందట. అందుకే అకీరా పాత కాలపు హెడ్ సెట్ వాడుతున్నాడట.

ఈ విషయాన్ని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక అకీరా ఎంట్రీ ఎప్పుడని… రేణు దేశాయ్ ని పలు సందర్భాల్లో మీడియా అడగడం జరిగింది. అది తన ఆసక్తి మీద ఆధారపడి ఉంటుందని అకీరా అన్నారు. ప్రస్తుతం మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటున్నాడని ఆమె చెప్పారు. అకీరా ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.