Akira Nandan debut confirmed: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు, టాలీవుడ్ మొత్తం అకిరా నందన్(Akira Nandan) ఎంట్రీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో అకిరా నందన్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యి బాగా వైరల్ అవ్వడం తో, అకిరా టాలీవుడ్ లోకి రావాలనే డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ లో ఈ రేంజ్ కటౌట్ ఏ హీరో కి కూడా లేదు. గ్రాండ్ గా టాలీవుడ్ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చి , ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు, పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ మొత్తం అకిరా ముందు ఉంటారు. నిర్మాతలు అయితే ఆయన పై వందల కోట్ల బడ్జెట్ ని పెట్టడానికి కూడా వెనుకాడరు. అలాంటి ఉజ్వల భవిష్యత్తు దక్కే ఛాన్స్ అతనికి.
కానీ అకిరా కి నటనపై కంటే మ్యూజిక్ పై విపరీతమైన మక్కువ ఉంది. తన స్నేహితులతో కలిసి ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ ని అందించాడు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సరికొత్త సౌండింగ్ విన్నాము అనే అనుభూతి కలిగింది. ఇప్పుడు త్వరలోనే ఆయన ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు, హీరో ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే అభిమానులకు బ్లాస్టింగ్ అయ్యే అప్డేట్ రాబోతుందంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతోంది. ఈ వార్త విన్న అభిమానులకు ఆనందపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. హాలీవుడ్ హీరో రేంజ్ లుక్స్ తో అల్లడిస్తున్న అకిరా నందన్ కేవలం మ్యూజిక్ డైరెక్షన్ కి మాత్రమే పరిమితం అయిపోతాడా?, హీరో గా చేసే ఆసక్తి లేదా అనే భయం పట్టుకుంది అభిమానుల్లో.
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నుండి ఇప్పుడు వరుసగా సినిమాలను ఆశించలేం. చేసినా కూడా రెండేళ్లకు ఒక సినిమా ఉంటుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే సినిమాలకు శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ ని అకిరా నందన్ లో చూసుకుందామని ఆశపడ్డారు ఫ్యాన్స్. అయితే కచ్చితంగా అకిరా భవిష్యత్తులో హీరో గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన నటన లో కూడా గత కొంతకాలంగ శిక్షణ తీసుకుంటున్నాడు. ‘అన్ స్టాపబుల్ షో’ లో రామ్ చరణ్ కూడా ఈ విషయం చెప్పుకొస్తూ త్వరలోనే ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇస్తాడని అంటాడు. స్వయంగా రామ్ చరణే చెప్పిన తర్వాత ఇక అభిమానుల్లో ఎలాంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు.